Kasthuri Shankar : నా బతుకు ఇలా అయిపోయింది ఏం చేస్తామంటూ న‌టి క‌స్తూరి ఆవేద‌న‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kasthuri Shankar : నా బతుకు ఇలా అయిపోయింది ఏం చేస్తామంటూ న‌టి క‌స్తూరి ఆవేద‌న‌

Kasthuri Shankar  : క‌న్నడ సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈమె ప‌లు సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్‌లో న‌టించి అల‌రించింది. గృహ‌ల‌క్ష్మీ సీరియ‌ల్‌లో 60 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న పాత్ర‌లో క‌నిపించింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో నాగార్జున సరసన అన్నమయ్య సినిమాలో నటించింది. అలాగే మరెన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. పెళ్లి తరువాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి, రీఎంట్రీలో సీరియ‌ల్స్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Kasthuri Shankar : నా బతుకు ఇలా అయిపోయింది ఏం చేస్తామంటూ న‌టి క‌స్తూరి ఆవేద‌న‌

Kasthuri Shankar  : క‌న్నడ సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈమె ప‌లు సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్‌లో న‌టించి అల‌రించింది. గృహ‌ల‌క్ష్మీ సీరియ‌ల్‌లో 60 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న పాత్ర‌లో క‌నిపించింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో నాగార్జున సరసన అన్నమయ్య సినిమాలో నటించింది. అలాగే మరెన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. పెళ్లి తరువాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి, రీఎంట్రీలో సీరియ‌ల్స్ చేస్తూ సంద‌డి చేస్తుంది. ఇక కాంట్ర‌వ‌ర్సీస్‌తో కూడా హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో కస్తూరి శంకర్ తన వయసు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

Kasthuri Shankar నా బతుకు ఇలా అయిపోయింది ఏం చేస్తామంటూ న‌టి క‌స్తూరి ఆవేద‌న‌

Kasthuri Shankar : నా బతుకు ఇలా అయిపోయింది ఏం చేస్తామంటూ న‌టి క‌స్తూరి ఆవేద‌న‌

Kasthuri Shankar  : మాటలు కోటలు దాటేస్తున్నాయిగా..

ఇటీవ‌ల నాకు డెవిల్ సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. అందులో సీత పాత్ర నేను చేయాల్సింది. అయితే నేను యంగ్‌గా క‌నిపిస్తున్నాని అగ్రిమెంట్ త‌ర్వాత తీసేశారు. ఇక రజినీకాంత్.. ‘కాలా’లో కూడా రజినీకాంత్ గారి పక్కన నేను చాలా యంగ్‌గా ఉన్నానని తీసేశారు. రజినీ పక్కన పెద్ద పెద్ద పిల్లలకి అమ్మలాగ నేను సెట్ కావ‌డం లేదని ఈశ్వరీరావుని తీసుకున్నారు. అందరూ వయసు అయిపోతుందని బాధపడతారు. కాని నేను వయసు ఎందుకు పెర‌గ‌డం లేదని బాధపడుతున్నాను. ఏం చేయను నా ఫేస్ అలాంటిది. యంగ్ గానే కనిపిస్తాను. నా జ‌ట్టుకి క‌ల‌ర్ కూడా వేసుకోను. ఇది ఒరిజినల్ కలర్. ఇప్పుడు నేను తెల్ల రంగు వేసుకొని నటించే ప‌రిస్థితి వ‌చ్చింది.

Kasthuri Shankar నా బతుకు ఇలా అయిపోయింది ఏం చేస్తామంటూ న‌టి క‌స్తూరి ఆవేద‌న‌

Kasthuri Shankar : నా బతుకు ఇలా అయిపోయింది ఏం చేస్తామంటూ న‌టి క‌స్తూరి ఆవేద‌న‌

నా బ‌తుకు ఇలా అయిపోయింది. వ‌య‌స్సు వ‌స్తే ఒక బాధ‌, రాక‌పోతే మ‌రొక బాధ‌. మరో ముప్పై ఏళ్ల వరకు నాకు తల్లి పాత్రలే వస్తాయి. కానీ ఇప్పుడు నేను మదర్ క్యారెక్టర్స్ చేయలేను. మహేష్ బాబుది నాదీ సేమ్ ఏజ్.. అలాంటప్పుడు ఆ హీరోల పక్కన మదర్‌గా చేస్తే హీరోయిన్‌గానే ఉంటాను కదా.. ఆయనకి జోడీగా ఉంటాను. కనీసం చూసేవాళ్లకి మదర్‌లా కనిపించాలి కదా.. అంటూ తెగ ఫీల్ అయిపోతుంది ఈ కస్తూరి శంక‌ర్.ఈమె ఇన్ని చెబుతుంది క‌దా గృహ‌ల‌క్ష్మీ సీరియ‌ల్‌లో అమ్మ‌మ్మ పాత్ర‌కి బాగా సెట్ అయింది.సీరియ‌ల్‌లో అమ్మ‌మ్మ పాత్ర చేసింది కాని సినిమాల‌లో మాత్రం మ‌హేష్ బాబు లాంటి వాళ్లకి త‌ల్లిగా నటించాలంటే చాలా ఫీలైపోతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది