21 ఏళ్ల క్రితమే అలాంటి పనులా?.. సుమ రాజీవ్ కనకాల వ్యవహారం మామూలుగా లేదు!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

21 ఏళ్ల క్రితమే అలాంటి పనులా?.. సుమ రాజీవ్ కనకాల వ్యవహారం మామూలుగా లేదు!!

సుమ రాజీవ్ కనకాలది ప్రేమ వివాహామన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి ఘనంగా పెళ్లి చేశారు. సుమ రాజీవ్ కనకాల వ్యవహారంపై నిత్యం ఏదో రకమైన రూమర్ వస్తూనే ఉంటుంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.. విడిపోయారు.. విడాకులు తీసుకున్నారు.. వేర్వేరుగా ఉన్నారంటూ రూమర్లు వస్తూనే ఉంటాయి. అయితే వాటిపై ఏనాడు కూడా అంత సీరియస్‌గా స్పందించలేదు. అలా సుమ రాజీవ్ మధ్య పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్య […]

 Authored By uday | The Telugu News | Updated on :8 December 2020,9:09 am

సుమ రాజీవ్ కనకాలది ప్రేమ వివాహామన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి ఘనంగా పెళ్లి చేశారు. సుమ రాజీవ్ కనకాల వ్యవహారంపై నిత్యం ఏదో రకమైన రూమర్ వస్తూనే ఉంటుంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.. విడిపోయారు.. విడాకులు తీసుకున్నారు.. వేర్వేరుగా ఉన్నారంటూ రూమర్లు వస్తూనే ఉంటాయి. అయితే వాటిపై ఏనాడు కూడా అంత సీరియస్‌గా స్పందించలేదు. అలా సుమ రాజీవ్ మధ్య పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.

Kaushal Manda About Anchor Suma and Rajeev Kanakala

Kaushal Manda About Anchor Suma and Rajeev Kanakala

కానీ ఈ మధ్య రాజీవ్ కనకాల సుమ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తామిద్దరం ఎంత సన్నిహితంగా ఉన్నామో పరోక్షంగా చెప్పేందుకు హింట్లు ఇస్తున్నారు. ప్రేమగా దిగిన సెల్ఫీలు షేర్ చేస్తూ.. వీడియోలు చేస్తూ ఒక్కటిగానే ఉన్నామని చెబుతున్నారు. అయితే ఈ మధ్య రాజీవ్ కనకాల తమ మధ్య జరిగిన గొడవల గురించి బయటకు చెప్పాడు. ఏ భార్యాభర్తల మధ్యనైనా జరిగే చిన్న చిన్న గొడవలే మా మధ్య కూడా జరిగాయయని కానీ వాటిని మీడియా పెద్దగా చూపిందని తెలిపాడు.

అయితే రాజీవ్ కనకాల సుమ పెళ్లి కాకముందే అంటే దాదాపు 20 , 21 ఏళ్ల క్రితం చెట్టాపట్టాలేసుకుని తిరిగారట. సుమను బైక్ మీద ఎక్కించుకుని రాజీవ్ కనకాల తిరిగేవాడట. ఆ దృశ్యాలను బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తాజాగా బయటకు వెళ్లడించాడు. క్యాష్ షోలో పాల్గొన్న కౌశల్.. సుమ రాజీవ్ కనకాల గుట్టు విప్పాడు. కానీ మా ఆయన నన్ను ఎప్పుడూ అలా తిప్పలేదే.. అంటే వేరే అమ్మాయిని వేసుకుని తిరిగాడా? అంటూ రివర్స్ కౌంటర్ వేసింది సుమ. మొత్తానికి కౌశల్ భలే పాయింట్ బయటకు తీశాడు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది