Kavitha Lakshmi Is Preparing Dosa To Send Money To Her Son
Kavitha Lakshmi : కవితా లక్ష్మి అనే సీరియల్ ఆర్టిస్ట్ మలయాళం లో చాలా సీరియల్స్ లో నటించింది. చాలా తక్కువ సమయంలోనే కుటుంబ ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఆమె ‘ శ్రీధనం ‘ అనే సీరియల్ లో శాంత పాత్రలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. అయితే ఆమెను అదృష్టం వరించలేదు. పైకి చూడటానికి స్టార్ అయిన ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆమె భర్తతో 13 ఏళ్ల క్రితమే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన పిల్లల మంచి చెడ్డలు చూసుకుంటుంది. అయితే కవిత లక్ష్మి కొడుకు బ్రిటన్ లో చదువుకుంటున్నాడు. అయితే చదువు బాగుంటుందని అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవచ్చని కొడుకుని బ్రిటన్ కు పంపించింది. అతను పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నప్పటికీ డబ్బులు చాలక పోవడంతో అతనికి అవసరమైన సాయాన్ని కూడా కవిత లక్ష్మి పంపించాల్సి వస్తుంది.
కవిత లక్ష్మీ తన కొడుకుకి నెలకు ఒకటిన్నర లక్షల రూపాయలను పంపించాల్సి ఉంది. ఇందుకోసం ఆమె కేరళ తమిళనాడు మధ్య నేషనల్ హైవే పైన రోడ్డు ప్రక్కన దోసలు, ఆమ్లెట్లు మరియు గొడ్డు మాంసం కూరలను ఆ రోడ్డుపై వెళ్లే కస్టమర్లకు అందిస్తున్నారు. లక్ష్మీ కుమారుడు ఆకాష్ కృష్ణ ఏడాది క్రితం బ్రిటన్ లో ఓ కోర్స్ లో చేరాడు. అయితే అది ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు ఉండడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. నెలకు 1.5 లక్షలు పంపించాలంటే నాకు చాలా కష్టమవుతుంది. వాయిదా పద్ధతిలో పంపించడానికి బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుందామనుకున్నాను కానీ తాకట్టు పెట్టుకోవడానికి నా దగ్గర భూమి, ఇల్లు వంటి ఆస్తులు లేకపోవడంతో బ్యాంకు వారు నాకు అప్పు ఇవ్వలేదు.
Kavitha Lakshmi Is Preparing Dosa To Send Money To Her Son
ప్రైవేట్ సంస్థలో నాకు ఖాతా ఉన్నప్పటికీ దాని గడువు పూర్తికాని కారణంగా వారు నాకు రుణం ఇవ్వడానికి అంగీకరించలేదు అంటూ కవిత లక్ష్మీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కవిత లక్ష్మి రెండు సీరియల్స్ లో చేస్తున్నారు. వాటిలో వచ్చే డబ్బులు ఆమె కుటుంబానికే సరిపోతాయి. కొడుకుకి కూడా పంపించాల్సిన అవసరం ఉండడంతో ఆమె పార్ట్ టైం గా రాత్రిపూట దోశలు వేస్తూ రోడ్డుపై అమ్ముతున్నారు. టీవీ, సినిమా ప్రపంచంలో జీవితాలు అన్ని విలాసవంతంగా ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చాలామంది జీవితాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. విలాసవంతమైన జీవితం కన్నా నాకు నా పిల్లల జీవితాలు నిలబడేలా ప్రోత్సహించడమే ముఖ్యమంటూ కవిత లక్ష్మి నవ్వుతూ చెప్తారు. నా పని నేను చేసుకోవడంలో తప్పేమీ లేదు కదా అని నవ్వేస్తారు. తన కుటుంబం కోసం ఇంతలా కష్టపడుతున్న ఆమెను చూసి నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు.
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
This website uses cookies.