Keerti Suresh : లక్ కలిసి రాలేదంతే..ఇప్పుడు చూడండి కీర్తి సురేష్ మాస్ అపీల్‌కు మీటర్లు పగుతున్నాయ్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Keerti Suresh : లక్ కలిసి రాలేదంతే..ఇప్పుడు చూడండి కీర్తి సురేష్ మాస్ అపీల్‌కు మీటర్లు పగుతున్నాయ్..

Keerti Suresh : ‘కళావతి.. కళావతి.. కళావతి’..ఇప్పుడు ఎవరి నోట విన్నా కళావతి పాట కళావతి మాట వినిపిస్తోంది. ఈ కళావతి ఏవరో తెలిసింది కదా..మహానటి కీర్తి సురేష్. ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో అందరూ మెచ్చుకుంటుందీ ఈమె గురించే. ఇన్ని రోజులు కీర్తి పనైపోయిందీ అనుకున్నారు. మహానటి సినిమా తర్వాత అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవుతూ వచ్చాయి. దాదాపు అరడజను సినిమాలు చేస్తే వాటిలో ఒక్కటి కూడా కీర్తి ఖాతాలో హిట్ […]

 Authored By govind | The Telugu News | Updated on :16 May 2022,12:30 pm

Keerti Suresh : ‘కళావతి.. కళావతి.. కళావతి’..ఇప్పుడు ఎవరి నోట విన్నా కళావతి పాట కళావతి మాట వినిపిస్తోంది. ఈ కళావతి ఏవరో తెలిసింది కదా..మహానటి కీర్తి సురేష్. ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో అందరూ మెచ్చుకుంటుందీ ఈమె గురించే. ఇన్ని రోజులు కీర్తి పనైపోయిందీ అనుకున్నారు. మహానటి సినిమా తర్వాత అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవుతూ వచ్చాయి. దాదాపు అరడజను సినిమాలు చేస్తే వాటిలో ఒక్కటి కూడా కీర్తి ఖాతాలో హిట్ చేరలేదు. దాంతో ఫేడవుట్ అవుతుందా.. అని కామెట్స్ వచ్చాయి.

ఇక ఇటీవల కీర్తి ప్రయోగాలు ఎక్కువగా చేస్తోంది. కథలో పస లేకపోయినా..ఆ విషయాన్ని గుర్తించలేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కమిటై ఫ్లాపులను నెత్తిమీద పెట్టుకుంది. దాంతోనే తన కెరీర్ గ్రాఫ్ సగం పడిందని చెప్పక తప్పదు. అంతేకాదు..ఈ యంగ్ బ్యూటీ సీనియర్ హీరోలకు చెల్లిగా నటించడానికి ఒప్పుకుంటుంది. ఇది రిస్క్ అని కొందరు అంటున్నా..రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారి సరసన హీరోయిన్‌గా నటించలేను..కానీ, అలాంటి లెజండరీ యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అంటే మాత్రం వదలను.. అని అంటోంది.

Keerthi Suresh is Cracking meters for mass appeal

Keerthi Suresh is Cracking meters for mass appeal

Keerti Suresh : ఇప్పుడు కీర్తి సురేశ్ హాట్ టాపిక్‌గా మారింది.

అయితే, ఇన్నేళ్ళ నుంచి కీర్తి నటించిన ఫ్లాప్ సినిమాల గురించే మాట్లాడి కామెంట్స్ చేసిన వారందరూ ఇప్పుడు సర్కారు వారి పాట కళావతి నామ జపం చేస్తున్నారు. అందంగా అమాయకమైన నటనతో ఆకట్టుకోవడమే కాదు..రఫ్‌గా హీరోకే ధంకీ ఇచ్చే సన్నివేశాలలోనూ ఇరగదీసింది. ఇక కీర్తి సర్కారు వారి పాట సినిమాతో మాంచి మాస్ హిట్ అందుకుంది. ఇందులో అమ్మడి మాస్ అపీల్ చూస్తే మీటర్లు బద్దలవ్వాల్సిందే. అలా అనేట్టుగా సర్కారు వారి పాట సినిమాలో అందాలను విందుగా ఇచ్చి ఆకట్టుకుంటోంది. సినిమాలో అన్నిటికంటే హైలెట్ కీర్తి గ్లామర్, మహేశ్ పర్ఫార్మెన్స్. కాబట్టే
ఇప్పుడు కీర్తి సురేశ్ హాట్ టాపిక్‌గా మారింది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది