Keerthy Suresh : దివి నుండి భువికి దిగి వచ్చిన దేవ కన్యలా కీర్తి సురేష్..ఇలా చూపిస్తే కుర్రాళ్లు ఏమై పోవాలమ్మడు..!
Keerthy Suresh : కీర్తి సురేష్ .. ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే కీర్తి సురేష్..ఇప్పుడు మాత్రం కుర్రాళ్లని నిద్ర పోనివ్వకుండా చేస్తుంది. కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది.
కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. టీవల కీర్తి సురేష్ తోటి హీరోయిన్స్ కుళ్లు కునేలా అందాలు ఆరబోస్తుంది. ఈ అమ్మడి గ్లామర్ షో మైండ్ బ్లాక్ చేయడంతో పాటు కుర్రాళ్లకి పిచ్చెక్కేలా చేస్తుంది. కీర్తి సురేష్ ఇంత అందంగా కనిపిస్తే కుర్రాళ్లు కమాన్ కమాన్ కళావతి అంటూ వెంటపడడం ఖాయం. కీర్తి సురేష్ ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటించింది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయం దక్కించుకుంది.

keerthy suresh beautiful looks are stunning
Keerthy Suresh : కైపెక్కిస్తున్న కీర్తి..
సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ని పరశురామ్ అందంగా ప్రజెంట్ చేశారు. మ.. మ.. మహేషా సాంగ్ లో కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయింది. మహేష్ తో కలసి కామెడీ టైమింగ్ ని కూడా కీర్తి సురేష్ అద్భుతంగా పండించింది. తెలుగు, తమిళం, మలయాళీ సినిమాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రలో కనిపిస్తూ తన అభిమానులు ఖుషీ చేస్తోంది. ఈ అమ్మడు కథానాయికగానే కాకుండా చెల్లెలి పాత్రలలో మైమరిపిస్తుంది. భోళా శంకర్, దసరా వంటి చిత్రాలతో ఈ అమ్మడు రానున్న రోజులలో సందడి చేయనుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాగానే తన హవాని నడిపిస్తుంది.ఈ అమ్మడు రానున్న రోజులలో టాప్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.