Keerthy Suresh : “చావనైనా ఛస్తా కానీ అలాంటి పని చేయను” మొహం మీదనే చెప్పేసిన కీర్తి సురేష్.!

Advertisement

Keerthy Suresh : ఒకప్పుడు ఏదైనా వార్త జనాలకు చేరాలంటే రేడియో ద్వారానో లేదంటే మీడియా ద్వారానే చేరవేర్చేవారు. కానీ.. ఇప్పుడు క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ఏ విషయం అయినా జనాల్లోకి వెళ్లిపోతుంది. అయితే.. సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే సమాచారం నిజమా.. అబద్ధమా అనేది పక్కన పెబితే.. ఏ విషయం అయినా సరే.. క్షణాల్లో సోషల్ మీడియాను మాత్రం చేరుతోంది. ముఖ్యంగా సినీ, రాజకీయాలకు సంబంధించిన వార్తలు అయితే వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా గాసిప్సే ఉంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

నందమూరి ఫ్యాన్స్ తనను ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆ వార్త వైరల్ అవుతోంది. దానికి కారణం ఏంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాలో నటించేందుకు కీర్తి సురేశ్ కు అవకాశం వచ్చిందని, అయితే.. ఆ సినిమాను కీర్తి సురేశ్ రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే.. తనపై వస్తున్న ఆ న్యూస్ పై కీర్తి సురేశ్ వెంటనే స్పందించింది. అసలు బుద్ధి ఉన్నవాళ్లు ఎవరైనా ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకుంటారా అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మడు. నేనే కాదు.. ఏ హీరోయిన్ కూడా ఆ చాన్స్ వస్తే వదులుకోరు అంటూ చెప్పుకొచ్చింది. అసలు.. ఇంత చెత్త రూమర్స్ ను ఎవరు, ఎలా క్రియేట్ చేస్తారో తెలియదు కానీ..

Advertisement
keerthy suresh comments about the rumour against her
keerthy suresh comments about the rumour against her

Keerthy Suresh : బుద్ధి ఉన్న వాళ్లు ఎన్టీఆర్ తో సినిమా చాన్స్ వస్తే వదులుకుంటారా? అన్న కీర్తి

అసలు సోషల్ మీడియాలో మంచి కంటే చెడునే ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. నాకు నిజంగా ఆ అవకాశం వస్తే మాత్రం నేను అస్సలు వదులుకోను అంటూ కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. నాకు ఎన్ని సినిమాలు ఉన్నా.. ఎన్టీఆర్ తో చాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోను.. అసలు ఆయన లాంటి నటుడితో నటించడమే నా అదృష్టం అంటూ ఎన్టీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తింది కీర్తి సురేశ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తన వ్యాఖ్యలపై స్పందించారు. అయితే.. కొరటాల శివ సినిమాలో ఎవరో బాలీవుడ్ నుంచి హీరోయిన్ ను తీసుకొచ్చే బదులు.. కీర్తి సురేశ్ ను హీరోయిన్ గా ఎన్టీఆర్ పక్కన ఎంపిక చేయొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. చూద్దాం మరి కొరటాల శివ.. కీర్తిని పరిగణనలోకి తీసుకుంటారో లేదో?

Advertisement
Advertisement