Keerthy Suresh : చీర‌లోను కాక రేపుతున్న‌కీర్తి సురేష్‌.. ట్రెండ్ మార్చిందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: May 30, 2022, 7:30 pm

Keerthy Suresh: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకేనే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్లగొడుతూ ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో అమ్మడి యాక్టింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చినా, వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కీర్తి సురేష్ లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో నటిస్తుందనే వార్త తెలుసుకుని, అప్పట్లో చాలా మంది నవ్వుకున్నారు కూడా. కానీ.. ఆ సినిమాలో ప్రాణంపెట్టి నటించిన కీర్తి సురేష్ అందరికీ తన నటనతో గట్టి రిప్లై ఇచ్చింది.అనంత‌రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కీర్తి ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చింది. అయితే ఇక్కడే ఆమె సినిమా సెలెక్షన్ పక్కదారి పట్టింది. కేవలం లేడీ ఓరియెంటెడ్ అనే ప్రయారిటీ తప్ప, సినిమాలో కంటెంట్ ఉందా లేదా అనేది ఆమె పెద్దగా పట్టించుకోలేదు.

Keerthy Suresh : కీర్తి సోకుల విందు..

దీంతో పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ.. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ మూటగట్టుకుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే కాదని, రెగ్యులర్ సినిమాలు చేయాలని భావించిన కీర్తి సురేష్.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్‌గా నటించింది.అయితే ఈ సినిమాలో అమ్మడి పాత్ర కాస్త నెగెటివ్ టచ్ ఉన్నా పెద్దగా ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక కీర్తి సురేష్ నటించిన తొలి వెబ్ మూవీ ‘చిన్ని’ కూడా ఆమె స్థాయి సినిమా కాదని సినీ క్రిటిక్స్ తీవ్రంగా విమర్శించారు.

Keerthy Suresh Cute saree looks viral

Keerthy Suresh Cute saree looks viral

ఒక మీడియం రేంజ్ హీరోయిన్ ఈ వెబ్ మూవీ చేసినా రిజల్ట్ సేమ్‌గా ఉండేదని వారు అంటున్నారు. కీర్తి సురేష్ తనలోని కొంటె కోణం పరిచయం చేస్తుంది. పంథా మార్చిన కళావతి సరికొత్తగా అందాల విందుకు తెరలేపింది. వెండితెరపై పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఇలా హాట్ హాట్ గా సిద్ధం కావడం జనాల మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా చీర‌క‌ట్టులో సోకుల విందు చేస్తూ మ‌త‌లు పోగొడుతుంది. ప్ర‌స్తుతం కీర్తి స్ట‌న్నింగ్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp