Keerthy Suresh : బిగ్ న్యూస్ : ఆ అబ్బాయితో కీర్తి సురేష్ పెళ్లి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Keerthy Suresh : బిగ్ న్యూస్ : ఆ అబ్బాయితో కీర్తి సురేష్ పెళ్లి?

 Authored By kranthi | The Telugu News | Updated on :29 May 2023,9:00 am

Keerthy Suresh : కీర్తి సురేశ్ తెలుసు కదా. మొన్ననే దసరా సినిమాలో చమ్కీల అంగీలేసి అంటూ స్టెప్పులు వేసిన అమ్ముడు త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. కీర్తి సురేశ్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే తనను చేసుకోబోయేది ఎవరా అని అందరిలో ఆసక్తి ఉంటుంది. ఈ మధ్య తన పెళ్లి గురించి చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఓవైపు వరుస సినిమాలతో కీర్తి సురేశ్ ఫుల్ టు బిజీ అయిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా కీర్తి సురేశ్ బిజీ అయిపోయింది.

Keerthy Suresh father gives clarity on her marriage

Keerthy Suresh father gives clarity on her marriage

ఈనేపథ్యంలో ఓ యువకుడితో ప్రస్తుతం కీర్తి సురేశ్ డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. అయ్యో నేను ఎవరితో డేటింగ్ లో లేను అని చాలా సార్లు కీర్తి  కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా జనాలు ఊరుకోవడం లేదు. ఇటీవల ఓ అబ్బాయితో కలిసి కీర్తి ఫోటో దిగింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తన డేటింగ్ నిజమే అన్నట్టుగా అందరూ అనుకున్నారు. అయితే.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు.. నా ఫ్రెండ్.. అంతే. బెస్ట్ ఫ్రెండ్ తో ఫోటో దిగితే బాయ్ ఫ్రెండ్ అంటూ మమ్మల్ని సోషల్ మీడియాలోకి లాగారు అంటూ కీర్తి చెప్పుకొచ్చింది.

Keerthy Suresh : ఆ వ్యక్తి నా ఫ్రెండ్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన కీర్తి

ఒకవేళ నా మిస్టరీ మాన్ రాగానే అప్పుడు ముందు మీకే చెబుతాను అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్. అయినా జనాలు వినడం లేదు. దీంతో చివరకు తన తండ్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అసలు నా కూతురు ఏ అబ్బాయితో డేటింగ్ లో లేదు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలు అన్నీ ఫేక్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ అబ్బాయి మా ఫ్యామిలీ ఫ్రెండ్. అతడి పుట్టిన రోజు సందర్భంగా ఫోటోలు షేర్ చేసింది అంతే.. అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది