Keerthy Suresh : చీర‌క‌ట్టులో సెగ‌లు పుట్టిస్తున్న కీర్తి సురేష్‌.. అప్స‌ర‌స‌లు కూడా దిగ‌దుడుపే..!

Authored By Sam C | The Telugu News | Updated on : 9 September 2022, 8:00 pm

Keerthy Suresh : మ‌హాన‌టి చిత్రంతో నేష‌న‌ల్ వైడ్‌గా ప్ర‌శంస‌లు పొందిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డి సొంతం. తెలుగు, తమిళం, మలయాళం మూడు భాషల్లో బిజీ హీరోయిన్‌గా మారింది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన ‘మామన్నన్స‌ అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ , వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ‘మామన్నన్‌’ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాపై కీర్తి సురేష్ చాలా హోప్స్ పెట్టుకుంది.

Keerthy Suresh : కీర్తి అందాలు అద‌ర‌హో..

కేర‌ళ కుట్టి అయిన కీర్తి సురేష్ రీసెంట్‌గా ఓనం పండుగ‌ని జ‌రుపుకుంది. ఓనం సంద‌ర్భంగా ఈ అమ్మ‌డు చీర‌క‌ట్టు ధ‌రించి త‌ల‌లో మ‌ల్లెపూలు పెట్టుకొని కుర్ర‌కారుకి సెగ‌లు పుట్టిస్తుంది. చీర‌క‌ట్టులో కీర్తి సురేష్‌ని ఇలా చూసిన వారు అప్స‌ర‌స‌లు కూడా నీ అందాల ముందు దిగ‌దుడుపే అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ పిక్స్ మాత్రం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక కీర్తి మామన్నన్‌ చిత్ర బృందానికి ఓనం పార్టీ ఇచ్చింది . ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఉదయనిధి, మరి సెల్వరాజ్, వడివేలుతో కలిసి ఓనం వేడుకలు జరుపుకుంది.

Keerthy Suresh Onam Special Pic Story

Keerthy Suresh Onam Special Pic Story

ఇక వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న కీర్తి సురేష్ సర్కారు వారి పాటతో హిట్ ట్రాక్ ఎక్కింది. మహేష్ ని మోసం చేసే అమ్మాయిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న మాస్ రోల్ లో కీర్తి ఆకట్టుకున్నారు. చాలా కాలం తర్వాత కీర్తికి మహేష్ హిట్ ఇచ్చాడు. మ‌రోవైపు స‌పోర్టింగ్ రోల్స్‌లోను సంద‌డి చేస్తుంది కీర్తి. స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉన్న కీర్తి చెల్లి పాత్రలు చేయడం నిజంగా పెద్ద సాహసం. అన్నాత్తే మూవీలో రజినీ సిస్టర్ రోల్ చేసిన కీర్తి… చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో సిస్టర్ రోల్ చేస్తున్నారు. నిజానికి మహేష్ పక్క ఆఫర్ వచ్చిన హీరోయిన్ సిస్టర్ రోల్ చేయడం ఎవరూ ఊహించని పరిణామం.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి