Keerti Suresh : నా పెళ్లి గురించి మీకు ఎందుకు రా .. పిచ్చ సీరియస్ అయిన కీర్తి సురేష్ !

Authored By aruna | The Telugu News | Published on: June 4, 2023, 8:00 pm

టాలీవుడ్ లో ‘ నేను శైలజ ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి సినిమా తోనే ప్రేక్షకులకు దగ్గరైన కీర్తి సురేష్ మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సర్కారు వారి పాట, దసరా సినిమాలతో మంచి పేరు దక్కించుకుంది. మరోవైపు చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు తమిళంలో కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ తమిళంలో మమన్నన్ సినిమాలో నటించింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్యఅతిథిగా హాజరు అయ్యాడు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మరోసారి పెళ్లి పై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది. పెళ్లి గురించి మీ స్పందన ఏంటి అని మీడియా వారు ప్రశ్నించగా దానికి బదులుగా కీర్తి సురేష్ అసహనం వ్యక్తం చేసింది. గతంలో నేను నా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాను.

Keerti Suresh clarity about her marriage

Keerti Suresh clarity about her marriage

ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పినా కూడా పదే పదే ఎందుకు పెళ్లి గురించి అడుగుతున్నారు. నా పెళ్ళి గురించి మీకు ఎందుకింత ఆసక్తి అంటూ ఎదురు ప్రశ్నించింది. నాకు పెళ్లి ఫిక్స్ అయితే తప్పకుండా నేనే స్వయంగా చెప్తాను అంటూ ప్రకటించింది. మరీ ఇప్పటికైనా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. ఇటీవల నాని దసరా సినిమాతో ఆకట్టుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం. వరుసగా హిట్లు కొడుతూ తన పేరును పాపులర్ చేసుకుంటుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp