kevvu karthik : అందరినీ కంటతడి పెట్టించిన ‘కెవ్వు కార్తీక్’.. ఎందుకో తెలుసా..!

Authored By mallesh | The Telugu News | Published on: December 7, 2021, 4:20 pm

kevvu karthik : కెవ్వు కార్తీక్.. ఈ పేరు వినగానే అందరికీ జబర్దస్త్ షో గుర్తుకు వస్తుంది. మాస్ అవినాష్ కెవ్వు కార్తీక్ పేరుతో ఉన్న టీంలో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. జబర్దస్త్ షో చాలా మంది నటులకు లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో చేరిన వారంతా ఇప్పుడు మంచి మంచి పొజిషన్స్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ నటులంతా వేరే వేరే బుల్లితెర షోలల్లో కూడా కనిపిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో వచ్చిన ప్రోగ్రాం కూడా చాలా బాగా నడుస్తోంది. ఇందులో కూడా ఈ నటులంతా కనిపిస్తున్నారు. సుడిగాలి సుధీర్ దీనికి యాంకర్‌గా పనిచేస్తున్నాడు. సుధీర్ తో పాటు మరికొందరు నటులు కూడా ఇందులో కనిపిస్తున్నారు.

హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, పొడుగు సుందరి వర్ష, ఇమాన్యుయేల్ వంటి జబర్దస్త్ కమెడియన్స్ కూడా శ్రీ దేవీ డ్రామా కంపెనీలో నటిస్తున్నారు. ఇందులో జడ్జిగా సీనియర్ యాక్టర్ ఇంద్రజ చేస్తుంది. ఈ నటి తన నవ్వుతో ప్రోగ్రామ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలుస్తోంది. ఇందులో కమెడియన్స్ చాలా బాగా నవ్వులు పూయిస్తున్నారు. వచ్చే ఆదివారం ఇందులో రజినీకాంత్‌ కోసం స్పెషల్ షో ప్లాన్ చేశారు. సూపర్ స్టార్ రజినీ పుట్టినరోజు సందర్భంగా సభ్యులందరూ రజనీ స్టైల్‌ను ఫాలో అయ్యారు. స్పెషల్ గెటప్పుల్లో కనిపించనున్నారు. అయితే, కెవ్వు కార్తీక్ మాత్రం అందరి కంటే కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు..

kevvu-karthik-who-made-everyone-cry

kevvu-karthik-who-made-everyone-cry

kevvu karthik : కార్తీక్ యాక్టింగ్‌కు ఫిదా.. ఏడిపించేశాడుగా

పొట్టి నటుడి వేషంలో మరుగుజ్జుగా కార్తీక్ కనిపిస్తాడు. ఆ స్కిట్ కోసం కార్తీక్ చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. ఇందులో పొట్టిగా ఉన్నాడని తన లవర్ అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. మధ్యలో ఎలా వదిలేసి వెళ్లిపోతావ్ అని కార్తీక్ అడుగగా.. నిన్ను ఆ దేవుడే ఇలా మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడని దారుణం గా అవమానిస్తుంది. అమ్మాయితో కలసి ఏడు అడుగులు వేయాలంటే ఆరు అడుగుల పొడవు మా పేరెంట్స్‌కు తెలియదు ఏమో.. అందరూ నా ఆకారాన్ని మాత్రమే చూస్తున్నారు కానీ, నా మనసు ఎందుకు చూడటం లేదని బాధపడుతాడు. తన నటనతో అందరినీ ఏడిపించేశాడు. ఇలా ప్రతీవారం ఏదో ఒక స్కిట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కార్తీక్ నటనను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp