Game Changer 1st day Collection : గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. తొలి రోజు ఎంత కలెక్షన్స్ రావొచ్చు..!
Game Changer 1st day Collection : దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత Ram CHaran రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ Game Changer Review సినిమాతో థియేటర్లోకి వచ్చాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా… కియారా అద్వానీ అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్జె సూర్య, సముద్రఖని, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే పలు సమస్యలను ఎదుర్కొని థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఊచకోతకోసింది.గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యమైనప్పటికీ దిల్ రాజు క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు.
Game Changer 1st day Collection కలెక్షన్స్ ఎంత అంటే..!
కేవలం 5 పాటలకు 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఊహకు అందని విషయం. ఒక్కోపాటు రెండు వారాలపాటు విదేశాల్లోని అత్యంత అద్బుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 450 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలుగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రాంచరణ్ సినిమాకు భారీగానే బడ్జెట్ జరిగింది. నైజాంలో 43 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయలు, నైజాంతో కలిపి ఈ మూవీ 145 కోట్ల రూపాయల మేర తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేసుకొన్నది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే.. కనీసం 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయలకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజు 80 కోట్ల నుంచి 90 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా 223 కోట్లు, 70 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు సినిమాలకు మధ్యస్తంగా వసూళ్లను కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇండియాలో ఈ సినిమాకు సంబంధించి 13,336 షోలు పడగా, వాటికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి దాదాపు రూ. 50 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇందులో తెలుగు వర్షన్ నుంచే దాదాపు రూ. 32 కోట్లకు పైగా టికెట్ బుకింగ్స్ జరిగాయి…