Game Changer: గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత.. మూవీ సేఫ్ జోన్‌లో ఉందా?
ప్రధానాంశాలు:
Game Changer: గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత.. మూవీ సేఫ్ జోన్‌లో ఉందా?
Game Changer: రామ్ చరణ్, కియారా అద్వాని ప్రధాన పాత్రలలో శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్ Game Changer .భారీ అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. అయితే తాజాగా ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా సుమారు రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది.తొలిరోజే మూవీ పై దారుణంగా నెగెటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్టివ్ కలెక్షన్ల పై భారీగానే పడింది. యూఎస్ లో బుకింగ్స్ కొంచెం డల్ గా ఉన్నా.. ఓవరాల్ గా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో మాస్ బీ,సీ సెంటర్స్ లలో ఈ సినిమాకు ప్రేక్షకులు ఆదరించారు.
Game Changer అఫీషియల్ కలెక్షన్స్..
‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో ‘గేమ్ చేంజర్’ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి తండ్రి కొడులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి Anjali కథానాయికలుగా నటించారు.ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ‘గేమ్ ఛేంజర్’కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. వారాంతంలో ఈ టికెట్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని అభిమానులు ఆశిస్తున్నారు.
రామ్ చరణ్ Ram Charan నటించిన ‘గేమ్ చేంజర్’ తెలుగులో రాష్ట్రాల్లో రూ. 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరి తొలిరోజే.. రూ. 186 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి సంక్రాంతి సీజన్ లో మిగతా సినిమాల నుంచి పోటీ తట్టుకొని ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. కాగా, ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో గేమ్ చేంజర్ కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు సంస్థ వెల్లడించింది. ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు గ్రాస్ రాగా, అల్లు అర్జున్ ‘పుష్ప-2’కు రూ.294 కోట్లు గ్రాస్ వచ్చాయి. ఈ సినిమాలో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. అప్పన్న, రామ్ నందన్ పాత్రలకుగానూ చరణ్ పై కురిపిస్తున్న ప్రశంసలను చూస్తుండడం సంతోషంగా ఉంది అని చిరు అన్నారు.