Haripriya : కెజిఫ్ నటుడుతో కన్నడ స్టార్ బ్యూటీ హరిప్రియ ఎంగేజ్ మెంట్… పెళ్ళి ఎప్పుడంటే….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Haripriya : కెజిఫ్ నటుడుతో కన్నడ స్టార్ బ్యూటీ హరిప్రియ ఎంగేజ్ మెంట్… పెళ్ళి ఎప్పుడంటే….!

 Authored By prabhas | The Telugu News | Updated on :4 December 2022,11:40 am

Haripriya : ప్రస్తుత కాలంలోని బహుభాషా హీరోయిన్ హరిప్రియ మరియు కేజీఎఫ్ నటించిన విశిష్ట సింహ ప్రేమలో ఉన్నారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే . వీరిద్దరూ దుబాయ్ నుండి బెంగళూరుకు తిరిగివస్తూ ఎయిర్ పోర్టులో కెమెరా కంట పడ్డారు. దీంతో వారి ప్రేమ వ్యవహారం అంతా అందరికీ తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే హరిప్రియ వశిష్టలు ఇంకొన్ని రోజుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. నిన్న వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం హరిప్రియ ఇంటి దగ్గర జరిగినట్లుగా సమాచారం. ఇక ఈ కార్యక్రమాన్ని అతికొద్ది మంది బంధుమిత్రులతో జరుపుకోవడం విశేషం. మరి పెళ్లి ఎప్పుడు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

దీంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే 2007లో బడి అనే తుళు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హరిప్రియ. ఇక ఆ తర్వాత కన్నడలో వరుసగా సినిమాలను చేసి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత కనగవేల్ కాక” అనే సినిమాతో తమిళంలోకి అడుగు పెట్టింది హరిప్రియ. “తకిట తకిట” అనే సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత తెలుగులో పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాటా, జై సింహ వంటి సినిమాలు చేశారు. కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు బుల్లితెర లో కూడా నటించారు.

KGF Actor Kannada Star Beauty Haripriya Engagement

KGF Actor Kannada Star Beauty Haripriya Engagement

ఇప్పుడు ఓ డ్యాన్ షో కి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక వశిష్ట సింహ విషయానికొస్తే…కేజిఎఫ్ సినిమాలో ఓ కీలక పాత్ర చేసి అందరికంట పడ్డాడు. గతం లో చాలా కన్నడ సినిమాలో చేసిన రాని గుర్తింపు ఈయనకు కేజీఫ్ లభించింది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడూ మొదలైందో ఎవరికి తెలియదు కానీ, చాలా త్వరగా పెళ్లి వరకు వచ్చేసారు. గతంలో కూడా ఓసారి వశిష్ట పుట్టినరోజు సందర్భంగా హరిప్రియ వశిష్టతో కలిసి డాన్స్ చేసిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. ఈ వీడియోను హరిప్రియ నే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు పార్ట్నర్ అని క్యాప్షన్ పెట్టింది. అక్కడ నుంచి వెలుగులోకి వచ్చిన వీరి వ్యవహారం ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది