కేజీఎఫ్ 2 టీజర్ ముందు అన్ని సినిమాల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

కేజీఎఫ్ 2 టీజర్ ముందు అన్ని సినిమాల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి ..!

 Authored By govind | The Telugu News | Updated on :10 January 2021,1:33 pm

కేజీఎఫ్ 2 టీజర్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజమౌళి బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాల రికార్డ్ ని ఇట్టే బద్దలు కొట్టేసింది. కేజీఎఫ్ 2 టీజర్ గురించి ఇండియా మొత్తం ఎంత ఆతృతగా ఎదురు చూశారో టీజర్ రిలీజైన కేవలం 5 నిముషాలలోనే తెలిసిపోయింది. ఇంతగా ఒక టీజర్ కోసం కోట్లలో జనాలు ఎదురు చూడటం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఒక్క రాజమౌళి సినిమాల గురించే ఇంత ఆతృతగా ఎదురు చూసేవారు.

KGF 2 Teaser Breaks YouTube World Record, Will it Beat Baahubali?

కాని ఇప్పుడు రాజమౌళి కి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాలతో చెక్ పెట్టాడని చెప్పుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ నుంచి వచ్చిన టీజర్స్ .. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ టీజర్ గురించి మొన్నటి వరకు గొప్పగా మాట్లాడుకున్న అభిమానులు.. ప్రేక్షకులు .. సినీ విశ్లేషకులు ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ టీజర్ రిలీజైన పది గంటల్లోనే “ఆర్ఆర్ఆర్”, “మాస్టర్” చిత్రాల రికార్డ్స్ ను బ్రేక్ చేసింది.

Ramaraju For Bheem - Bheem Intro - RRR (Telugu) | NTR, Ram Charan, Ajay  Devgn, Alia | SS Rajamouli - YouTube

కేజీఎఫ్ హీరో కన్నడ రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ 2 సినిమా టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన తరువాత 10 గంటల 30 నిమిషాల వ్యవధిలో “కేజీఎఫ్ – చాప్టర్ 2” 20 లక్షల వ్యూస్ ను రాబట్టి సెన్షేషన్ ని క్రియేట్ చేసింది. అంతేకాదు టీజర్ రిలీజైన పదిన్నర గంటల్లోనే ‘మాస్టర్’ 18.5 లక్షలు, ‘సర్కార్’ 11.8 లక్షలు, ‘ఆర్ఆర్ఆర్’ (రామరాజు ఫర్ బీమ్) 9.41 లక్షలు, ‘మెర్సెల్’ 7.82 లక్షల వ్యూస్ ను తెచ్చుకున్నాయి. ఇక 7వ తేదీన టీజర్ విడుదల కాగా, ఇంతవరకూ 11 కోట్లకు పైగా వ్యూస్ రావడం ప్రతీ ఒక్కరినీ షాక్ కి గురి చేస్తోంది. కేవలం టీజర్ కే ఇలాంటి రెస్పాన్స్ వస్తే త్వరలో రాబోతున్న ట్రైలర్ .. ఆ తర్వాత వచ్చే సినిమా విషయంలో ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్ఠిస్తుందో అని చెప్పుకుంటున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది