Koratala Siva : తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్ ట్రాక్ కలిగిన ఉన్న స్టార్ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఈ తీసిన ప్రతీ సినిమా హిట్ అయ్యింది. వసూళ్ల పరంగాను కొరటాల మార్క్‌ను అందుకున్నాయి. ఈయన ఇప్పటివరకు 4 సినిమాలు చేయగా అందులో సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ను కొనసాగుతూ వచ్చాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమా సమయంలో దేవిశ్రీ తో ఏర్పడిన స్నేహం అలా కంటిన్యూ చేస్తూ వచ్చాడు కొరటాల. వీరిద్దరి కాంబోలో వరుసగా 4 సినిమాలు రాగా అవన్నీ మ్యూజికల్ పరంగా మంచి హిట్‌ను అందుకున్నాయి. కానీ, ఐదవ సినిమా ఆచార్యకు కూడా దేవిశ్రీ ప్రసాద్‌ను అనుకున్నప్పటికీ చిరంజీవి సలహాతో దేవీ శ్రీ బదులు మణిశర్మకు అవకాశం ఇచ్చారట.
మణిశర్మ సీనియర్ సంగీత దర్శకుడు. చిరంజీవి మణిశర్మల కాంబోలో మంచి హిట్‌లు పడ్డాయి. ఆచార్య సినిమా కోసం చిరంజీవి సూచన మేరకు మణిశర్మ తో వర్క్ చేసిన కొరటాల శివ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో చేయబోతున్నారు. ఎన్టీఆర్ 30 సినిమాకు సంగీత దర్శకుడు ఎవరా అనుకుంటుండగా మళ్లీ దేవి శ్రీ ప్రసాద్‌ను రంగంలోకి దించుతాడని అనుకున్నారు కొందరు. కానీ ఎన్టీఆర్ సూచన మేరకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలిసి వర్క్ చేసేందుకు కొరటాల ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 సినిమాకు అనిరుద్ కన్ఫర్మ్ అని వార్తలు కూడా జోరందుకున్నాయి. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. అనిరుధ్‌తో కలిసి సినిమా చేయాలని ఎన్టీఆర్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారట..
అరవింద సమేత సినిమాకు అనిరుధ్‌ను తీసుకుని మళ్లీ క్యాన్సిల్ చేశారు. తెలుగులో అనిరుధ్ వర్క్ చేసిన సినిమాలు మ్యూజికల్‌గా సక్సెస్ అయ్యాయి. కానీ సినిమాలు కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్‌ను దక్కించుకోలేదు. అందుకే ఆయనకు ఆఫర్లు ఆశించిన స్థాయిలో రావడం లేదని కొందరి వాదన. తారక్ 30 సినిమాలో అనిరుధ్‌కు అవకాశం రావడంతో ఖచ్చితంగా ఆయన టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇస్తాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి చిరు, తారక్ వలన కొరటాల రెండు సార్లు కాంప్రమైజ్ అయ్యారని తెలుస్తోంది.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.