Kota srinivasa rao: అలాంటి బూతులు మాట్లాడే బదులు వ్యభిచారం చేసుకోండి .. సంచలన విషయాలను బయట పెట్టిన కోట..

Authored By vamana sai | The Telugu News | Updated on : 22 September 2021, 8:59 am

Kota srinivasa rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు ఎవరి విషయంలోనైనా ఒకేలా స్పందిస్తుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా కూడా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటిలో జరిగిన సంఘటనల గురించి సంచలన విషయాలను వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా కోట శ్రీనివాస రావుది సుధీర్ఘ ప్రయాణం. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించిన గొప్ప నటుడు. గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని సంఘటనలు, అనుభవాలుండటం వాటిని పంచుకోవడం జరిగింది.

kota srinivasa rao revealed Jamba Lakidi Pamba Movie

kota srinivasa rao revealed Jamba Lakidi Pamba Movie

 

ఇందులో భాగంగా ఆయన ‘జంబలకిడిపంబ’ సినిమా గురించిన పలు ఆసక్తికరమైన విశేషాలు, ఆ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు జరిగిన సంఘటనల చెప్పుకొచ్చారు. 50 లక్షల రుపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కామెడీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఐరన్ లెగ్ శాస్త్రి, బ్రహ్మానందం, ఆలీ, బాబు మోహన్, కోట శ్రీనివాస రావు, మల్లికార్జున రావు, శ్రీ లక్ష్మి లాంటి కమెడియన్స్‌తో ఈవీవీ చేసిన ప్రయోగం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది.

Kota srinivasa rao: జంధ్యాల గారు కూడా వ్యంగ్యంగా మాట్లాడాడు.

kota srinivasa rao revealed Jamba Lakidi Pamba Movie

kota srinivasa rao revealed Jamba Lakidi Pamba Movie

 

అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చాలామంది విమర్శించారట. ఆ విషయాలను కోట శీనివాసరావు పంచుకున్నారు. ‘ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ఉండాలి. ఈవీవీ గారు మా అందరినీ కూర్చోబెట్టి కథ చెప్పినప్పుడు ఆసక్తిగా ఎంతో అనిపించింది. ఈ సినిమాలో నటించేటప్పుడు బ్రహ్మానందం, ఆలీ, కల్పనా రాయ్‌, మల్లికార్జున రావు ఇలా అందరం కలిసి ఓ 15 రోజులు విశాఖపట్నం వీధుల్లో మంగళసూత్రం మెడలో వేసుకొని తిరిగాం.

kota srinivasa rao revealed Jamba Lakidi Pamba Movie

kota srinivasa rao revealed Jamba Lakidi Pamba Movie

 

ఆ సమయంలో ‘ఇలాంటి సినిమాలు చేసే బదులు వ్యభిచారం చేసి బతకొచ్చు కదా’ అని ఓ డైరెక్టర్ ఎవరితోనో అంటే అది ఈవీవీ వరకూ వెళ్ళింది. ఆ విషయాన్ని నాతో చెప్పి చాలా బాధపడ్డారు. అంతేకాదు ‘ఏంటా బూతులేంటి?’ అంటూ ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారు కూడా వ్యంగ్యంగా మాట్లాడాడు. సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యాక అందరూ షాకయ్యారు’ అని కోట చెపుకొచ్చారు.

Advertisement

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి