Kota Srinivasa Rao : కోటకు ఇష్టమైన హీరోలు వీరే..!!
Kota Srinivasa Rao : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో నాలుగు దశాబ్దాలకు పైగా రాజ్యమేలిన దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు ఇక లేరు. 83 ఏళ్ల వయస్సులో ఆరోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటుగా నిలిచింది. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యభరితమైన పాత్రలు ఇలా ఎన్నో విభిన్న రోల్స్ చేస్తూ ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన మరణవార్తతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
కోటా శ్రీనివాసరావు నటనకు సంబంధించిన అనేక కోణాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ఆయన వ్యక్తిగత అభిరుచులు కూడా ఆసక్తికరంగా ఉండేవి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు తమ ఇష్టమైన నటులు అని తెలిపారు. ఈ ముగ్గురిలో ఒక్కోరికి ప్రత్యేకతలున్నాయని ఆయన పేర్కొన్నారు.
Kota Srinivasa Rao : కోటకు ఇష్టమైన హీరోలు వీరే..!!
ఆయన మాటల్లో, “బన్నీ కంటే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పే విధానం బాగుంటుంది. కానీ బన్నీ యాక్షన్, డాన్స్ అంటే నాకు ఇష్టం. ఇక మహేశ్ బాబు అందగాడు. ఎంతమంది హీరోలు వచ్చినా ఆయనలా ఎవరూ ఉండలేరు” అంటూ అభిమానాన్ని వ్యక్తం చేశారు. కోటా చెప్పిన ఈ మాటలు ఈరోజు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చలువదృష్టికి నచ్చిన ఈ తరం హీరోల పట్ల చూపిన ప్రేమను అభిమానులు స్మరించుకుంటున్నారు.