Kota Srinivasa Rao : సినీ ప్రముఖుల కన్నీటి మధ్య ముగిసిన కోట శ్రీనివాస్ అంత్యక్రియలు
Kota Srinivasa Rao : తెలుగు సినిమా రంగానికి విలక్షణమైన పాత్రలతో ప్రాణం పోసిన నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. ఆయన మృతి చిత్రసీమను తీవ్ర విషాదంలో ముంచింది. నటుడిగా, రాజకీయ నేతగా ఎంతో పేరు తెచ్చుకున్న కోట గారు తనదైన శైలిలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన మరణంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
కోట శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా, కుమారుడు కోట ప్రసాద్ కొన్నేళ్ల క్రితమే మరణించారు. అందుకే ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని నివాసం నుంచి మహాప్రస్థానం వరకు కోట గారి అంతిమ యాత్ర సాగింది. కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొని, కన్నీటితో కోట గారికి చివరి వీడ్కోలు పలికారు.
Kota Srinivasa Rao : సినీ ప్రముఖుల కన్నీటి మధ్య ముగిసిన కోట శ్రీనివాస్ అంత్యక్రియలు
కోట శ్రీనివాసరావు మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్ వంటి నేతలు సంతాపం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, దర్శకుడు రాజమౌళి, నటులు బ్రహ్మానందం, బాబూ మోహన్, డా. రాజేంద్ర ప్రసాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రానా దగ్గుబాటి, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి తదితరులు కోట గారికి ఘన నివాళులు అర్పించారు. కోట గారి మృతి తెలుగు సినిమా ప్రపంచానికి ఎప్పటికీ తీరని లోటుగా మిగిలిపోతుంది.