KR Vijaya Daughter : హీరోయిన్ కె.ఆర్ విజయ కూతురు ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. ఆమె మరెవరు కాదో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KR Vijaya Daughter : హీరోయిన్ కె.ఆర్ విజయ కూతురు ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. ఆమె మరెవరు కాదో…!

KR Vijaya Daughter : తెలుగు పరిశ్రమలో అప్పటి హీరోయిన్ కె.ఆర్ విజయ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సావిత్రి, యమున వంటి పలు హీరోయిన్లతో సమానంగా ఈమె తన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పించింది. కె ఆర్ విజయ జానపద, పౌరాణిక, సాంఘిక సినిమాలలో ఎక్కువగా నటించారు. ఇక తెలుగు సినిమాలలో దేవత పాత్ర అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే నటి కె ఆర్ విజయ అని చెప్పవచ్చు. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 December 2022,12:20 pm

KR Vijaya Daughter : తెలుగు పరిశ్రమలో అప్పటి హీరోయిన్ కె.ఆర్ విజయ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సావిత్రి, యమున వంటి పలు హీరోయిన్లతో సమానంగా ఈమె తన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పించింది. కె ఆర్ విజయ జానపద, పౌరాణిక, సాంఘిక సినిమాలలో ఎక్కువగా నటించారు. ఇక తెలుగు సినిమాలలో దేవత పాత్ర అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే నటి కె ఆర్ విజయ అని చెప్పవచ్చు. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం లో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.

అలాగే ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అయితే కె ఆర్ విజయ కూతురు మరియు చెల్లెలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అనే సంగతి చాలామందికి తెలియదు. ఈమె చెల్లెలు అయిన సావిత్రి మలయాళం లో హీరోయిన్గా మంచి పేరును సంపాదించుకున్నారు. హీరోయిన్ సావిత్రి కేవలం మలయాళం సినిమాలను మాత్రమే చేశారు. ఇక కె ఆర్ విజయ ఇద్దరు కూతుర్లు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకరు హీరోయిన్గా మరొకరు నటి గా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

KR Vijaya Daughter star heroin in tollywood now

KR Vijaya Daughter star heroin in tollywood now

ఆమె కూతురు అనూష హీరోయిన్ గా మరియు మరొక కూతురు మణిరాగా సుధా నటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తెలుగుతోపాటు వీళ్లు తమిళ్, మలయాళం సినిమాలలో కూడా నటించారు. కె ఆర్ విజయ బంధువులు చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక కెఆర్ విజయ కూతురు అనూష మలయాళం లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా పలు సినిమాలలో హీరోయిన్గా చేసింది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది