Krishna Bhagawan : మెగా బ్రదర్ నాగబాబు వెళ్లిన తరువాత జబర్దస్త్ షోకు సరైన జడ్జ్ దొరకడం లేదు. మధ్యలో ఎంతో మందిని ట్రై చేశారు. కొన్ని రోజులు రోజానే సోలో జడ్జ్‌గా వ్యవహరించింది. ఆ తరువాత ఇంకొంత మంది సీనియర్ హీరోయిన్లను తీసుకొచ్చింది. సంఘవి, లైలా, ఆమని, కుష్బూ వంటి వారంతా కూడా గెస్ట్ జడ్జ్‌లుగా వచ్చారు. ఆ తరువాత పూర్ణ, శ్రద్దా దాస్ వంటి వారు కూడా వచ్చారు. అయితే ఏ ఒక్కరు కూడా సెట్ కాలేదు. అయితే మధ్యలో ఆలీ కూడా కొన్ని ఎపిసోడ్‌లలో కనిపించాడు. చివరకు మనోను జడ్జ్‌గా ఫిక్స్ చేశారు. పైన చెప్పిన వాళ్లందరిలోకెల్లా మనో కాస్త నయం. చాలా రోజులు జడ్జ్‌గా ఉన్నాడు. స్కిట్లలో కూడా పాల్గొన్నాడు. ఆదితో కలిసి మనో స్కిట్లు చేసేవాడు.
అలా జబర్దస్త్ షోకు ఓ జడ్జ్ దొరికారని అనుకున్నారు. ఇంతలోనే రోజా వెళ్లిపోయింది. ఆ తరువాత మనో కూడా వెళ్లిపోయాడు. స్టార్ మాలో సింగింగ్ షో ప్రారంభం కావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. అయితే మధ్యలో మళ్లీ అలా వచ్చేవాడు. మళ్లీ గ్యాప్ ఇచ్చేవాడు. అయితే జబర్దస్త్ షోకు సరైన జడ్జ్, పర్మనెంట్‌గా ఉండే జడ్జ్ ఎవరా? అని అంతా అనుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలోనే కృష్ణ భగవాన్ కనిపించాడు. ఓ సారి శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు గెస్టుగా వచ్చి అల్లాడించాడు. తన ప్రాసలు, పంచ్‌లతో అందరినీ ఆడేసుకున్నాడు. ఈ స్పాంటేనిటీ, కామెడీ టైమింగ్ చూసి అంతా ఫిదా అయ్యారు. ఈయన జడ్జ్‌గా ఉంటే బాగుంటుందని అంతా అనుకున్నారు. యూట్యూబ్ వీడియోల కింద కామెంట్లలో అంతా దాని గురించే మాట్లాడుకునేవారు.
మొత్తానికి అందరి కోరిక మేరకు జబర్దస్త్ కొత్త జడ్జ్‌గా కృష్ణ భగవాన్ ఆ కుర్చీలో కూర్చుండిపోయాడు. మొదటి ఎపిసోడ్‌లోనే చించి అవతల పారేసినట్టున్నాడు. డైటింగ్ చేసిన నాగుపాములా ఉందని శాంతి స్వరూప్ మీద.. బట్టలు మార్చుకోకుండానే ఇన్ని పనులు చేశావా? నువ్ మామూలు ఆర్టిస్ట్‌వి కాదు.. అది మాకు తెలుసు.. నీకు కూడా తెలుసు.. అంటూ చలాకీ చంటి మీద కౌంటర్లు వేసేశాడు కృష్ణ భగవాన్. తాగుబోతు రమేష్ టీం చేసిన స్కిట్ మీద ఇంద్రజ జడ్జ్మెంట్ ఇవ్వడం, స్కిట్ కంటే ఆమె జడ్జ్మెంటే పెద్దగా ఉందని ఇంద్రజ మీద కూడా ఆయన కౌంటర్లువేశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.