Home » Entertainment » Dorababu Calls Anasuya Instead Of Rashmi Gautam
Entertainment

Anasuya – Rashmi Gautam : అనసూయను మరిచిపోని దొరబాబు.. పరిగెత్తించిన యాంకర్ రష్మీ

Authored By
aruna
The Telugu News | Published on: August 23, 2022, 5:20 pm
Advertisement

Anasuya – Rashmi Gautam : జబర్దస్త్ షో అంటే ఆడియెన్స్‌కు కొంత మంది గుర్తుకు వస్తుంటారు. వారిని ఎప్పటికీ మరిచిపోలేరు. జబర్దస్త్ అంటే నాగబాబు, జబర్దస్త్ అంటే అనసూయ.. జబర్దస్త్ అంటే రోజా.. జబర్దస్త్ అంటే సుధీర్ ఇలా.. కొంత మంది మొహాలు గుర్తుండిపోతాయంతే. అయితే చూసే జనాలకే అలా ఉంటే.. అక్కడి వారు ఇంకా అంత త్వరగా ఎలా మరిచిపోతారు. అదే ఇప్పుడ సమస్యగా వచ్చింది. ఆది టీంలో చేసే దొరబాబుకు సపరేట్‌గా పరిచయం అక్కర్లేదు. బీ గ్రేడ్ మూవీలతో దొరబాబు బాగా ఫేమస్ అయ్యాడు. అది చాలదన్నట్టుగా వైజాగ్ ఘటనలో పోలీసులకు పట్టుబడ్డాడు. అలా దొరబాబు మరింతగా వార్తల్లోకి ఎక్కాడు. అయినా కూడా ఆది తన టీంలో పెట్టుకున్నాడు.

Advertisement

మొత్తానికి ఆది టీంలో మెల్లిగా ఏదో అలా నెట్టుకొస్తున్నారు దొరబాబు, పరదేశీ. ఈ ఇద్దరూ ఆది టీంలో తప్పా ఇంకెక్కడా కనిపించరు. దొరబాబుకు అయితే సినిమాల్లోనూ చాన్సులు వస్తున్నాయి. అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తుంటాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆది జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. దీంతో ఈ టీం కూడా కనిపించకుండాపోయింది. మళ్లీ ఇప్పుడు దొరబాబు, పరదేశీ కనిపిస్తున్నారు. రైజింగ్ రాజు అయితే పూర్తిగా కనిపించకుండాపోయాడు. అయితే వచ్చీ రాగానే దొరబాబు పప్పులో కాలేసినట్టు కనిపిస్తోంది. ఏ లోకంలో ఉన్నాడో ఏమో గానీ ఇంకా కూడా అనసూయ ధ్యాసలోనే ఉన్నట్టు కనిపిస్తోంది.

Dorababu Calls Anasuya instead of Rashmi Gautam

Advertisement

యాంకర్ రష్మీ స్టేజ్ మీద స్టెప్పులు వేసింది. ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. అదే అనసూయ స్టెప్పులు అంటూ ఏదో అనబోయాడు. ఇంతలో రష్మీకి ఎక్కడో కాలినట్టుంది. ఏంటి అని అనేసింది. సారీ రష్మీ అంటూ దొరబాబు కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ రష్మీ మాత్రం ఊరుకోలేదు. దొరబాబును పరిగెత్తించింది. కొట్టేందుకు ప్రయత్నం చేసింది. తాను అంత కష్టపడి అక్కడ యాంకరింగ్ చేస్తుంటే.. మళ్లీ అనసూయ పేరు ఎత్తడంతో రష్మీ హర్ట్ అయినట్టుంది. కానీ అనసూయ వేసిన ముద్ర అలాంటిది మరి. జబర్దస్త్ అంటేఅనసూయ అందాలే ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి