Prabhas : కృష్ణం రాజు ఎంత సౌమ్యుడు అనే విషయం మనందరికి తెలిసిందే. ఆయన తన కెరీర్‌లో ఏ రోజు కూడా వివాదాల జోలికి వెళ్లలేదు. సినిమాలలోను రాజకీయాలలోను కృష్ణం రాజు తన సత్తా చూపించారు. తనదైన స్వభావంతో ఇటు సినీ పరిశ్రమలో అటు రాజకీయాల్లో తన మార్క్ చూపించారు కృష్ణం రాజు.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కృష్ణం రాజు హైదరాబాద్ లో ఈ రోజు (ఆదివారం) తెల్లవారు జామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. కృష్ణం రాజు ఇక లేరనే ఈ వార్త తెలియడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కృష్ణం రాజు హఠాన్మరణం ప్రతి ఒక్కరికి షాకింగ్‌గా మారింది. ప్రభాస్ అయితే వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. పెద్దనాన్న మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు.
82 సంవత్సరాల వయసున్న కృష్ణం రాజు మధుమేహం, పోస్ట్ కొవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత నెల 5న పోస్టు కొవిడ్ సమస్యలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించారని తెలిపారు. అయితే ప్రభాస్- కృష్ణం రాజు పలు చిత్రాలలో నటించి మెప్పించారు. 2009లో విడుదలైన బిల్లా చిత్రంలో వీరిద్దరూ మొదటిసారి కలిసి కనిపించారు. ప్రభాస్ మాఫియా డాన్, పిక్ పాకెటర్ గా రెండు విభిన్నమైన పాత్రలు చేశారు. బిల్లాగా ప్రభాస్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బిల్లా విడుదలైన మూడేళ్లకు 2012లో ప్రభాస్-కృష్ణంరాజు రెబల్ చిత్రంలో కలిసి నటించారు.
కృష్ణంరాజు మాఫియా లీడర్ గా సరికొత్త లుక్ ట్రై చేశారు. ప్రభాస్ నాన్నగా కృష్ణంరాజు నటించారు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఫెయిల్ అయిన రెబల్ ప్లాప్ గా మిగిలిపోయింది. ముచ్చటగా మూడోసారి రాధే శ్యామ్ చేశారు. కృష్ణంరాజు చివరి చిత్రం ఇదే కావడం విశేషం. ప్రభాస్ కెరీర్ లో రాధే శ్యామ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. భారీ నష్టాలు మిగిల్చిన ఈ మూవీ ప్రభాస్ కి షాక్ ఇచ్చింది. పెదనాన్న కృష్ణంరాజు సెంటిమెంట్ ప్రభాస్ కి కలిసి రాలేదు. ఇతర హీరోలకు హిట్స్ ఇచ్చిన కృష్ణంరాజు అబ్బాయికి మాత్రం డిజాస్టర్స్ ఇచ్చారు. ఈ అన్యాయం తీరనిది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.