Prabhas : ప్రభాస్‌ని ఎంతో ప్రేమించే కృష్ణం రాజు ఆయ‌న‌కు అన్యాయం చేశాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్రభాస్‌ని ఎంతో ప్రేమించే కృష్ణం రాజు ఆయ‌న‌కు అన్యాయం చేశాడా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :11 September 2022,7:00 pm

Prabhas : కృష్ణం రాజు ఎంత సౌమ్యుడు అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ఆయ‌న త‌న కెరీర్‌లో ఏ రోజు కూడా వివాదాల జోలికి వెళ్లలేదు. సినిమాల‌లోను రాజ‌కీయాల‌లోను కృష్ణం రాజు త‌న స‌త్తా చూపించారు. తనదైన స్వభావంతో ఇటు సినీ పరిశ్రమలో అటు రాజకీయాల్లో తన మార్క్ చూపించారు కృష్ణం రాజు.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కృష్ణం రాజు హైదరాబాద్ లో ఈ రోజు (ఆదివారం) తెల్లవారు జామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. కృష్ణం రాజు ఇక లేరనే ఈ వార్త తెలియడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కృష్ణం రాజు హ‌ఠాన్మ‌ర‌ణం ప్ర‌తి ఒక్కరికి షాకింగ్‌గా మారింది. ప్ర‌భాస్ అయితే వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. పెద్ద‌నాన్న మ‌ర‌ణాన్ని అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నాడు.

Prabhas : క‌లిసి రాలేదు..

82 సంవత్సరాల వయసున్న కృష్ణం రాజు మధుమేహం, పోస్ట్ కొవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత నెల 5న పోస్టు కొవిడ్ సమస్యలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించారని తెలిపారు. అయితే ప్ర‌భాస్‌- కృష్ణం రాజు ప‌లు చిత్రాల‌లో న‌టించి మెప్పించారు. 2009లో విడుదలైన బిల్లా చిత్రంలో వీరిద్దరూ మొదటిసారి కలిసి కనిపించారు. ప్రభాస్ మాఫియా డాన్, పిక్ పాకెటర్ గా రెండు విభిన్నమైన పాత్రలు చేశారు. బిల్లాగా ప్రభాస్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బిల్లా విడుదలైన మూడేళ్లకు 2012లో ప్రభాస్-కృష్ణంరాజు రెబల్ చిత్రంలో కలిసి నటించారు.

krishnam raju gives hand to prabhas

krishnam raju gives hand to prabhas

కృష్ణంరాజు మాఫియా లీడర్ గా సరికొత్త లుక్ ట్రై చేశారు. ప్రభాస్ నాన్నగా కృష్ణంరాజు నటించారు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఫెయిల్ అయిన రెబల్ ప్లాప్ గా మిగిలిపోయింది. ముచ్చటగా మూడోసారి రాధే శ్యామ్ చేశారు. కృష్ణంరాజు చివరి చిత్రం ఇదే కావడం విశేషం. ప్రభాస్ కెరీర్ లో రాధే శ్యామ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. భారీ నష్టాలు మిగిల్చిన ఈ మూవీ ప్రభాస్ కి షాక్ ఇచ్చింది. పెదనాన్న కృష్ణంరాజు సెంటిమెంట్ ప్రభాస్ కి కలిసి రాలేదు. ఇతర హీరోలకు హిట్స్ ఇచ్చిన కృష్ణంరాజు అబ్బాయికి మాత్రం డిజాస్టర్స్ ఇచ్చారు. ఈ అన్యాయం తీర‌నిది అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది