Krishnam Raju : కృష్ణంరాజు అలా చనిపోవాలనుకున్నాడా.. కాని అలా జరగలేదా?
Krishnam Raju : ఆజానుబాహుడు, టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణం రాజు ఈ రోజు తెల్లవారుజామున అకాల మరణం చెందారు. ఆయన మృతి వారి కుటుంబానికే కాదు సినీ ప్రపంచానికి కూడా తీరని లోటు అని చెప్పాలి. మెగా స్టార్ చిరంజీవి కృష్ణం రాజు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఇప్పటికే ట్వీట్టర్ వేదికన భావోద్వేగ ప్రకటన చేసిన ఆయన స్వయంగా ప్రభాస్ ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణం రాజుతో తనకున్న సంబంధాన్ని తెలియజేశారు. ఇక జనసేన అధినేతగా కృష్ణం రాజు పార్థివ దేహానికి నివాళి అర్పించారు. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుగదలకు కృష్ణం రాజు చేసిన సేవలను గుర్తు చేశారు.
Krishnam Raju : ఆ కోరిక తీరలేదు..
ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజుని మీరు సాధించాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తే.. జీవిత చరమాంకంలో ఓ పచ్చటి చెట్టు కింద కూర్చుని గుండె మీద చేయి వేసుకుని, నాకిచ్చిన ఈ జన్మలో నేనెవరికీ ద్రోహం చేయలేదు. నా వల్ల ఎవరికీ బాధ కలగలేదు దేవుడా అనే భావనతో కన్నుమూయాలి అని అన్నారు. అలా ఆయన కన్న కలలు అయితే జరగలేదు కాని నిజంగా తన మాటలు వల్ల, చేష్టలు వల్ల ఎవరికీ ఆయన ఇబ్బంది కలిగించలేదు. వివాదాలకు దూరంగా ఉండేవారు కృష్ణంరాజు ప్రకృతి నీడలో కన్నుమూయాలనుకున్నారు. కానీ చివరకు హాస్పిటల్‌లో కన్నుమూశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఆయన మరణవార్త తెలుసుకొని ఉదయమే సంతాపం వ్యక్తం చేసిన తారక్ ప్రభాస్ మరియు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెబల్ స్టార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ప్రశాంత్ నీల్ కూడా రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణవార్తను జీర్ణించుకోలేకపోయారు. ఇండస్ట్రీలో ఎంతగానో ప్రోత్సహించే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణం రాజు పార్థివ దేహానికి నివాళి అర్పించి, ప్రభాస్ కు ధైర్యం చెప్పారు.