Krithi Shetty : పవన్ కళ్యాణ్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ..?
Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కృతి శెట్టిKrithi Shetty ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ క్రేజ్‌తో వరుసగా సినిమాలకి సైన్ చేసింది. ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమాలో అవకాశం అందుకుంది. సాయి పల్లవి, మడోన్నా స్టెబాస్టియన్ కూడా ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే వీరందరికంటే కూడా కృతి శెట్టి Krithi Shetty పేరే ఎక్కువగా పాపులర్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే సుధీర్ బాబు – ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

Krithi Shetty Act With Pawan kalyan
ఈ రెండు సినిమాలు కమిటయిన కృతి శెట్టికి అనూహ్యంగా రాం పోతినేని నటిస్తున్న సినిమాలో అవకాశం వచ్చింది. తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రాం నటిస్తున్న తన 19వ సినిమాలో హీరోయిన్‌గా కృతికి అవకాశం దక్కింది. ఇది తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కానుంది. తెలుగులో క్రేజ్ ఉన్న ఈ ఉప్పెన బ్యూటీ రాం సినిమాతో తమిళంలో కూడా అడుగుపెట్టబోతోంది. ఇలా మూడు క్రేజీ మూవీస్ చేస్తున్న ఈమె కి ఓ గోల్డెన్ ఛాన్స్ దక్కిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే ఈమె ఇక కొన్నేళ్ళ వరకు సౌత్‌లో తిరుగుండదని చెప్పుకుంటున్నారు.
Krithi Shetty : మరొక హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించే అవకాశాలున్నాయట.

Krithi Shetty Act With Pawan kalyan
హరీశ్ శంకర్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రాబోతున్న 28వ సినిమా కాగా ఇందులో హీరోయిన్స్ ఇద్దరుంటారని సమాచారం. అందులో ఓ హీరోయిన్‌గా ఉప్పెన బ్యూటి కృతి శెట్టి Krithi Shettyని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించే అవకాశాలున్నాయట.