Krithi Shetty : కృతి శెట్టి అంతలా నచ్చిందా? వద్దన్నా వినకుండా బేబమ్మ వెంట పడుతున్న స్టార్ హీరో కొడుకు.. ఎవరో తెలుసా?
Krithi Shetty : కృతి శెట్టికి ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృతి శెట్టి కంటే కూడా బేబమ్మ అంటే అందరికీ తెలుస్తుంది. బేబమ్మ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఉప్పెనలా వచ్చి తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో నటించింది. తాజాగా ది వారియర్ సినిమాలోనూ నటించింది. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్ లోనూ తను అవకాశాలను చేజిక్కించుకుంటోంది.
కోలీవుడ్ లోనూ తనకు ఫుల్లు డిమాండ్ ఉంది. స్టార్ హీరోలు కూడా కృతి శెట్టినే తమ సినిమాల్లో హీరోయిన్ గా కావాలని డిమాండ్ చేస్తున్నారట. అంతే కాదు.. తన డేట్స్ దొరికేంత వరకు షూటింగ్ ను పోస్ట్ పోన్ చేసుకునే వాళ్లూ ఉన్నారు. కృతి శెట్టికి ఉన్న క్రేజ్ చూసి కోలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో కొడుకు తనకు బంపర్ ఆఫర్ ఇచ్చాడట. తన బర్త్ డే పార్టీకి రమ్మన్నాడట. అంతే కాదు.. తనకు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాడట. అతడు హీరో కూడా కావడంతో అతడితో గొడవ ఎందుకు అనుకొని.. అతడు హద్దులు దాటుతున్నాడని తెలుసుకొని వెంటనే అతడి ఆఫర్ కు నో చెప్పేసిందట.

krithi shetty alleges star hero son in kollywood offered huge money
Krithi Shetty : కృతి శెట్టికి బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో కొడుకు
వెంటనే కాల్ కూడా కట్ చేసిందట. ఒక స్టార్ హీరో కొడుకు అయి ఉండి.. అంత క్రేజ్ ఉన్న కుర్ర హీరో అయి కూడా ఇలా ప్రవర్తించడం ఏంటని కృతి అనుకుందట. అయితే.. ఎటువంటి ఆఫర్లకు లొంగకుండా.. తన వ్యక్తిత్వానికి కాపాడుకున్న బేబమ్మను చూసి ప్రస్తుతం అందరూ శెభాష్ అంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ది వారియర్ సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఏది ఏమైనా నువ్వు అలాగే ఉండు అమ్మడు. నీ క్యారెక్టరే నీకు బలం. అదే నీకు కెరీర్ ను నిర్దేశిస్తుంది.. అంటూ ఈ విషయం తెలిసిన తర్వాత నెటిజన్లు కూడా తెగ పొగుడుతున్నారు.