Krithi Shetty : అడ‌వి కాచిన వెన్నెల‌లా కృతి శెట్టి అందం.. మ‌తులు పోతున్నాయంటున్న ఫ్యాన్స్

Authored By Sam C | The Telugu News | Updated on : 3 July 2022, 2:30 pm

Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ యంగ్ బ్యూటీ క్యూట్ లుక్స్, కళ్ళతోనే హావభావాలు పలికించగలిగే కెపాసిటీ యువతలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టేలా చేశాయి. ముంబైలో సెటిలయిన తుళు కుటుంబంలో జ‌న్మించిన కృతి తండ్రి ఒక బిజినెస్ మాన్ కాగా తల్లి ఒక ఫ్యాషన్ డిజైనర్. చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆమెకు ఆసక్తి ఉండేది కానీ మొదట ఆమెకు టీవీ యాడ్స్ లో నటించే అవకాశం దొరికింది. అలా ఆమె టీవీ యాడ్స్ లో నటిస్తూ 17 ఏళ్ల వయసులోనే హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ థర్టీ అనే సినిమాలో ఒక స్టూడెంట్ పాత్రలో కనిపించింది ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది.

కృతి అందాల ఆర‌బోత‌… ఉప్పెన పాపులారిటీతో ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది ఈ కన్నడ అందం. అందులో భాగంగా కృతి శెట్టి రామ్ పోతినేని హీరోగా వస్తోన్న వారియర్ చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ‘ది వారియర్’ అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రామ్ లుక్ ఒకటి విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

krithi shetty cute looks are stunning

krithi shetty cute looks are stunning

ట్రైలర్ కూడా అదిరిపోయింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న కృతి శెట్టి సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డు క్యూట్ లుక్స్ లో కేక పెట్టించే అందంతో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. చీర‌క‌ట్టులో కృతి స్ట‌న్నింగ్ లుక్స్ మైమర‌చిపోయేలా చేస్తుంది. చురకత్తుల్లాంటి చూపులతో యువత మనసులు కొల్లగొడుతోంది. కలర్ ఫుల్ డ్రెస్ లో ఆమె మత్తు కళ్ళని చూస్తే అభిమానులు మైకంలో మునిగిపోవడం ఖాయం. అంతలా ఆమె గ్లామర్ పిక్స్ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం కృతి శెట్టి చేతినిండా సినిమాలు ఉన్నాయి. నితిన్ మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ చిత్రాలని ప్రస్తుతం కృతి శెట్టి చేస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాలకు ఆమె పేరు పరిశీలనలో ఉంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి