Krithi Shetty : త‌న మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టిన కృతి శెట్టి

Authored By Sam C | The Telugu News | Published on: May 1, 2022, 3:30 pm

Krithi Shetty: కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన కృతి శెట్టి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. కెరియర్ ఆరంభంలోనే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ప్రస్తుతం కృతి శెట్టి నుంచి మరో మూడు సినిమాలు రానున్నాయి. సుధీర్ బాబు సరసన చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ .. నితిన్ జోడీగా చేసిన ‘మాచర్ల నియోజకవర్గం’ .. రామ్ సరసన కథానాయికగా చేసిన ‘ది వారియర్’ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ .. ” ఇంతవరకూ నేను చేసిన పాత్రలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివే. అలా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడం వల్లనే ఆడియన్స్ నన్ను ఆదరించారు. తెరపై ‘రాకుమారి’గా కనిపించాలనేది నా డ్రీమ్ రోల్. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది . కృతి కి భిన్నమైన క్యారెక్టర్‌లు లభించడం వల్లే తాను ఇప్పుడు ఈ పోజీషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.కృతి శెట్టి మాట్లాడుతూ…”నాకు ఎప్పుడు ఒకే క్యారెక్టర్స్ చేయడం ఇష్టం ఉండదు. నేను ప్రతిసారీ కొత్తగా కనిపించడానికే ట్రై చేస్తున్న. అలాంటి కధలనే చూస్ చేసుకుంటున్నా.

krithi shetty dream to be expalained

krithi shetty dream to be expalained

Krithi Shetty : కృతి డ్రీమ్

నా దగ్గరకొచ్చే కథల్లో గత చిత్రాలను పోలినవి లాగా అనిపించినవి వద్దని చెప్పేస్తా. సవాలు విసిరే క్యారెక్టర్ లల్లోనే కనిపించాలి. అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది. త్వరలో సొంత డబ్బింగ్‌ చెప్పుకోవాలనీ అనుకుంటున్నా అంటూ బోలెడ‌న్ని విష‌యాలు చెప్పుకొచ్చింది. కృతి శెట్టి జోరు చూస్తుంటే ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల‌లో టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఊపేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. కాగా, యంగ్ బ్యూటీ కృతి శెట్టి సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. సూపర్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో కృతి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఓ ప్రక్క కెరీర్ రేసు గుర్రంలా ఉరకలేస్తుంటే… ఇంస్టాగ్రామ్ వేదికగా మనసులు దోచేస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp