Krithi Shetty : కృతి శెట్టి నాగ చైతన్యతో సెటిలైనట్టేనా..?

Authored By vamana sai | The Telugu News | Published on: June 24, 2022, 1:00 pm

Krithi Shetty : టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ అక్కినేని హీరోతో నటిస్తే ఆ తర్వాత అదే ఫ్యామిలీ హీరో సరసన రొమాన్స్ చేసే అవకాశం అందుకుంటుంది. దీనికి ఉదాహరణ ఇదరు గ్లామర్ బ్యూటీస్. వారే పూజా హెగ్డే, నిధి అగర్వాల్. మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా వెలుగుతున్న పూజా హెగ్డే ముందు అక్కినేని నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అదే సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ముకుంద మూవీలోనూ నటించింది. ఈ రెండు సినిమాలు అంతగా అకట్టుకోలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్ళిన పూజా అక్కడ హిట్ అందుకోలేదు.

దాంతో మళ్ళీ తిరిగి టాలీవుడ్‌కు వచ్చింది. ఇక్కడ మూడు నాలుగు ఫ్లాపుల తర్వాత మహేష్ బబుతో చేసిన మహర్షి సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్‌గా మారింది. అప్పటి నుంచి మేకర్స్ పూజాను లక్కీ హీరోయిన్‌గా చూస్తున్నారు. అందుకే, అఖిల్ నటించిన మూడు సినిమాల ఫ్లాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో హీరోయిన్‌గా పూజాను తీసుకున్నారు. చైతూతో చేసిన ఒక లైలా కోసం ఓ మాదిరిగా హిట్ అయినా..అఖిల్ సరసన నటించిన సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది.ఇక నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన మొదటి తెలుగు సినిమా నాగ చైతన్యతోనే. సవ్యసాచి సినిమాలో చైతన్యకు జోడీగా నటించింది.

Krithi Shetty in Naga Chaitanya new movie‌ Heroine 

Krithi Shetty in Naga Chaitanya new movie‌ Heroine

Krithi Shetty : చైతూతో రొమాన్స్‌కు రెడీ అయిన కృతి నెక్స్ట్ సినిమాలో అఖిల్ సరసన..?

ఆ వెంటనే అఖిల్ సరసన మిస్టర్ మజ్ఞూ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలు నిధికి హిట్ ఇవ్వలేకపోయాయి. కానీ, అన్నదమ్ములతో మాత్రం బాగానే రొమాన్స్ చేసింది నిధి. ఇప్పుడు ఈ క్రమంలోనే ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా అక్కినేని హీరోలతో సెటిలవుతుందని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఇప్పటికే కృతి శెట్టి, చైతూతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించి హిట్ అందుకుంది. తాజాగా మళ్ళీ చైతూ సరసన కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. రెండవసారి చైతూతో రొమాన్స్‌కు రెడీ అయిన కృతి శెట్టి నెక్స్ట్ సినిమాలో అఖిల్ సరసన నటించే అవకాశం అందుకోవడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి.

vamana sai

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp