Krithi Shetty : ఆర్తి అగ‌ర్వాల్ చేసిన పొర‌పాటే.. బేబ‌మ్మ చేస్తోందా.. ఆ హీరోతో ప్రేమ‌లో ప‌డ‌టం..!

Authored By mallesh | The Telugu News | Updated on : 22 July 2022, 9:30 pm

Krithi Shetty : ఆర్తీ అగ‌ర్వాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచిత‌మే. అప్ప‌ట్లో ఈ బ్యూటీ కోసం కుర్ర‌కారు ప‌డిస‌చ్చిపోయారు. విక్టరీ వెంకటేష్ న‌టించిన‌ నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీ అయింది. అగ్ర హీరోలందరితో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ప్ర‌భాస్, ఎన్టీఆర్, త‌రుణ్, ఉద‌య్ కిర‌ణ్ వంటీ క్రేజీ హీరోల‌తో న‌టించింది. ఎక్కువ‌గా సీనియ‌ర్ హీరోల‌తో న‌టించ‌డం.. క‌థ‌ల ఎంపిక‌లో చేసిన మిస్టేక్స్.. దీనికి తోడు కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమ‌లో ప‌డింది ఈ బ్యూటీ. ఇక ఆ త‌ర్వాత ఆర్తి లైఫ్ లో ఎన్నో సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ త‌ర్వాత చ‌నిపోవ‌డంతో ఆర్తి అగ‌ర్వాల్ క‌థ ముగిసింది.

అయితే ఇప్పుడు ఇలాంటి డెసీష‌న్స్ నే ఓ యంగ్ బ్యూటీ తీసుకుంటుంద‌ని అంటున్నారు. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకుని వ‌రుస ఆఫ‌ర్లు చేజిక్కించుకుంటోంది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. ఉప్పెన బ్యూటీ కృతీశెట్టి. ఈ సినిమాలో కృతి న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక దీంతో వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. వెంట వెంట‌నే బంగార్రాజు, శ్యాంమ్ సింగారాయ్ వంటి సినిమాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఏర్ప‌డింది. రీసెంట్ గా దీ వారియ‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అలాగే నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం.. మూవీతో మ‌రో సారి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానిని వ‌స్తోంది. తెలుగుతో పాటు త‌మిళ్ లో కూడా అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

Kriti Shetty doing same mistake as Aarthi Agarwal

Kriti Shetty doing same mistake as Aarthi Agarwal

Kriti Shetty : సీనియ‌ర్ హీరో స‌ర‌స‌న‌..

అయితే ప్ర‌స్తుతం కృతీ త‌మిళ్ లో మ‌రో ఆఫ‌ర్ అందుకుంద‌ట‌. అయితే ఓ సీనియ‌ర్ టాలెంటెడ్ హీరోతో జ‌త‌క‌ట్ట‌డానికి ఓకే చెప్పింద‌ట‌. దీంతో కృతి సీనియ‌ర్స్ తో అవ‌స‌ర‌మా.. అంటున్నారు. త‌మిళ‌ డైరెక్ట‌ర్ బాలా ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా ఓ ప్ర‌జెక్ట్ ప‌ట్టాలెక్క‌బోతుంద‌ట‌. అయితే ఈసినిమాలో కృతిని సూర్య స‌ర‌స‌న ఎంపిక చేశార‌ట‌. దీంతో సూర్య తో సినిమా ఒప్పుకొని తప్పుచేసిందని అంటున్నారు కొందరు. దీనికి తోడు టాలీవుడ్ యంగ్ హీరోతో కృతీ ప్రేమలో పడిందని అంటున్నారు. వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్తున్న టైమ్ లో క‌థ‌ల ఎంపిక‌లో పొర‌పాట్లు.. ల‌వ్ ఇలాంటి చేయ‌డంతో ఆర్తి అగ‌ర్వాల్ తో పోల్చి చూస్తున్నారు. మ‌రి నిజంగానే ల‌వ్ స్టోరీ న‌డుపుతుందా.. దీనిపై బేబ‌మ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి