Kushboo : ఖుష్బూని కూడా క‌మిట్‌మెంట్ అడిగారా.. టాలీవుడ్ హీరో ప‌రువు తీసేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kushboo : ఖుష్బూని కూడా క‌మిట్‌మెంట్ అడిగారా.. టాలీవుడ్ హీరో ప‌రువు తీసేసిందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :1 September 2022,5:30 pm

Kushboo : సినిమా ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఆఫ‌ర్స్ అందుకోవ‌డానికి వాళ్లు చాలా ఇబ్బందులు ప‌డ‌గా, వాటికి సంబంధించిన విష‌యాల‌ను ఒక్కొక్క‌రు మెల్ల‌గా రివీల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు రాణించడం అంటే అంత అషా మాషి కాదు. ఎన్నో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. నటన పై ఎంత ఇష్టం ఉన్నా సినిమాలు అంతే ప్రేమ ఉన్నా.. కానీ, అవకాశాలు రావాలంటే ఇబ్బందులు తప్పవు. అప్పట్లో నటి శ్రీరెడ్డి తనను వాడుకుని అవకాశం ఇవ్వకుండా వదిలేశారు అని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత చాలా మంది కూడా త‌మ కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ప‌డ‌గా, ఒక్కొక్క‌రు ఆ విష‌యాల‌పై నోరు విప్పుతున్నారు.

Kushboo : ప‌రువు తీసేసింది..

అందాల బొద్దుగుమ్మ ఖుష్బూ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.అప్ప‌ట్లో ఆమెకు గుడులు కూడా క‌ట్టారంటే ఖుష్బూపై ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలకు జోడిగా నటించి తన నటనతో మెప్పించింది. టాలీవుడ్ లో తొలి సినిమానే విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాలో నటించి ప్రేకషకులను తనవైపు తిప్పుకుంది. కుష్బూ అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఖుష్బూకి త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌గా వీరాభిమానులు ఉన్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో కుష్బూ కూడా తనను కమిట్మెంట్ అడిగారని సంచలన ఆరోపణలు చేసింది.

Kushboo Reveals Secrets Of Her Movie Chances

Kushboo Reveals Secrets Of Her Movie Chances

టాలీవుడ్ స్టార్ హీరో త‌న‌ని క‌మిట్‌మెంట్ అడిగాడు అని చెప్పింది ఖుష్బూ. ఆ స‌మ‌యంలోతనకు కోపం వచ్చిందని చెప్పింది. దాంతో వెంటనే మీ కూతుర్ని మా తమ్ముడి దగ్గరకు పంపిస్తే నేను కమిట్మెంట్ ఇస్తా అని చెప్పానని పేర్కొంది. తాను ఇచ్చిన కౌంట‌ర్ దెబ్బ‌తో ఆ హీరో ఫేస్ మాడిపోయింద‌ని.. ఆ దెబ్బ‌తో త‌న‌తో జాగ్ర‌త్త‌గా ఉండేవాడ‌ని కూడా తెలిపింది. మ‌రి టాలీవుడ్ స్టార్ హీరో ఎవర‌నే విష‌యం మాత్రం రివీల్ చేయ‌క‌పోవ‌డంతో అత‌ను ఎవ‌రా అని ఆరాలు తీసే ప‌నిలో ప‌డ్డారు అభిమానులు. ప్ర‌స్తుం ఖుష్బూ సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ పోషిస్తుంది. మ‌రో వైపు రాజకీయాల్లో బిజీగా ఉంది. ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో జాయిన్ అయ్యింది. యాక్టివ్ మెంబ‌ర్‌గా త‌న క‌ర్త‌వ్యం నిర్వ‌ర్తిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది