Vishal : విశాల్ ఆరోగ్యం విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ..!
ప్రధానాంశాలు:
Vishal : విశాల్ ఆరోగ్యం విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ..!
Vishal : పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగులోనూ మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు Vishal విశాల్. అసలు విశాల్ సినిమాలకు తెలుగులో మాములు డిమాండ్ లేదు. ఇప్పుడంటే శివ కార్తికేయన్, ధనుష్ సినిమాలంటూ.. మనం ఎగబడి చూస్తున్నాం కానీ.. ఒకప్పుడు తెలుగులో విశాల్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన నటించిన పందెం కోడి సినిమాకి ఇప్పటికీ తెలుగులో డిమాండ్ ఉంది. విశాల్ ఇటీవల ‘మదగజరాజు’ సినిమా ఈవెంట్‌లో కనిపించిన తీరు ప్రతి ఒక్కరికీ షాకింగ్‌గా అనిపించింది. సమయంలో విశాల్ చాలా సన్నబడి కనీసం నిల్చోడానికి ఇబ్బంది పడటంతో పాటు, అతడి బాడీ మొత్తం షేక్ అవుతున్నట్లు అనిపించింది….
Vishal ఇది అసలు క్లారిటీ..
మాట్లాడేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. కొద్ది సమయం మాట్లాడి ఆయన వెళ్లి పోయారు. అప్పటి నుంచి విశాల్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు విశాల్ ఆరోగ్యం గురించి కామెంట్ చేస్తున్నారు. దాంతో విశాల్ వైద్యులు హెల్త్ బులిటెన్‌ని విడుదల చేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఆయన జ్వరంతో బాధపడుతున్నారని టీమ్ చెప్పినప్పటికీ… ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు వాకబు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో విశాల్ ఆరోగ్యం గురించి సీనియర్ నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఆయనకు జ్వరం వచ్చిందని తెలిపారు. ‘మదగదరాజ’ సినిమా 11 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోందని… అందుకే అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్ కు వచ్చారని వెల్లడించారు.
103 డిగ్రీల జ్వరంతో విశాల్ వణికిపోయాడని ఖుష్బూ తెలిపారు. ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావని తాను అడిగితే… 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని, అందుకే కచ్చితంగా రావాలనుకున్నానని చెప్పాడని వెల్లడించారు. ఈవెంట్ పూర్తికాగానే విశాల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లామని… ఆయన ఇప్పుడు కోలుకుంటున్నాడని తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ సినిమా కోసం విశాల్ ఎంతో కష్టపడ్డాడని కితాబునిచ్చారు. విశాల్ ఈవెంట్‌కి వచ్చిన రోజు డెంగీ ఫీవర్‌తో భాదపడుతున్నట్లు తెలిపింది. 103 డిగ్రీల జ్వరం ఉన్న కూడా ఈవెంట్‌కి వచ్చాడని.. అంత జ్వరం ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు అని తాను విశాల్‌ను అడిగినట్లు చెప్పింది. అయితే విశాల్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకే రావాలి అనుకున్నట్లు విశాల్ అన్నట్లు ఖుష్బూ చెప్పుకోచ్చింది