Taraka Ratna : నందమూరి తారకరత్న మరణం పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వీడియో వైరల్..!
Taraka Ratna : తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తారకరత్న మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి అని స్పష్టం చేశారు. అటువంటి మనిషి మృతి విషయంలో చంద్రబాబు నీచాతి నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు. గుండెపోటు వచ్చిన మొదటి రోజే తారకరత్న మరణించడం జరిగింది. అయితే ఎక్కడ తన కొడుకుకి చెడ్డ పేరు వస్తుందో అని ఇన్ని రోజులు ఆ అబ్బాయిని ఆ విధంగా ఉంచారు. ఇది నిజంగా చాలా దుర్మార్గం. నా భర్త కూడా ఆ విధంగానే కుమిలి..కుమిలి మరణించాడు.

Lakshmi Parvathi Comments On Taraka Ratna Demise
దానికి కారణం కూడా చంద్రబాబే. నందమూరి కుటుంబం నుండి వారికి సాయం చేద్దామని.. ఎంతో అభిమానంతో పాదయాత్ర రోజు మొదటి రోజు వస్తే.. గుండె నొప్పి వచ్చింది. అలాంటి సమయంలో పాదయాత్రను వాయిదా వేసుకోవచ్చు కదా. ఆ అబ్బాయి మరణం మొదటి రోజే జరిగింది అని వైద్యులు ఆనాడే వెల్లడించారు అని లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గుండె ఆగిపోయిందని చెప్పినప్పుడే అందరికీ అర్థమైపోయింది.
కానీ వారి స్వార్థం కోసం ఎక్కడ ప్రజలు అపశకునంగా భావిస్తారో…అనీ ఈ రీతిగా చేశారు. వారి తండ్రి కొడుకులు అపశకునమని… ప్రజలందరికీ ఎప్పుడో అర్థం అయింది. తారకరత్న భార్య ..పిల్లలు బాధ వర్ణించలేనిది. ఇటువంటి పరిస్థితులను కూడా తన రాజకీయ పబ్బనికి వాడుకునే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడే. ఇలాంటి రాజకీయాలకు నందమూరి కుటుంబం స్వస్తి పలక పోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అంటూ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
