NTR Chief Security : సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరికి తెలియని విషయాలు బయట పెట్టిన NTR Cheef Security officer…!
ప్రధానాంశాలు:
NTR Chief Security : సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరికి తెలియని విషయాలు బయట పెట్టిన NTR Cheef Security officer...!
NTR Chief Security : తాజాగా సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్రటరీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ప్రేక్షకులకు తెలియజేశారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ లక్ష్మీపార్వతి మొదట ఎన్టీఆర్ యొక్క జీవిత కథ తీస్తా అని వచ్చిందని తెలియజేశారు. ఇక దానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదట. నువ్వేంటి నా జీవిత చరిత్ర తీసేది శ్రీ నారాయణ లాంటి వారు రాస్తా అంటేనే వద్దని చెప్పా అని అన్నారట. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు ఆమె రావడం మాట్లాడుకోవడం జరిగింది. అలా కొన్నాళ్లు సాగిన తర్వాత ఒకరోజు ఎన్టీఆర్ గారు బాలకృష్ణ నేను ఆవిడ సమక్షంలో నాచారం స్టూడియోలో ఉన్నప్పుడు, బ్రదర్ నాకు ఇప్పుడు మెంటల్ కంపెన్షన్షిప్ కావాలి. ఈ వయసులో నాకు అలాంటి కోరికలు ఏం లేవు కదా. అందుకే నేను ఆవిడను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని డైరెక్ట్ గా చెప్పారు.
ఇక దానికి సార్ మీరు పెళ్లి చేసుకోవాలో లేదో మాకు తెలియదు. అది మీ వ్యక్తిగత వ్యవహారం. ఇక పెళ్లి ఆవిడని చేసుకుంటారా మరొకరిని చేసుకుంటారని కాసేపు పక్కన పెడదాం.మీకు ఇప్పుడు 73 సంవత్సరాలు ఉన్నాయి.అంటే మీ మనవళ్లు మనవరాలకు పెళ్లి చేసే వయసు. ఇలాంటి సమయంలో మీరు పెళ్లి చేసుకుంటే పబ్లిక్ మిమ్మల్ని అప్లికేషన్ చేయరు అని తెలియజేశారట.ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ ఇంకొకరి భార్య. ఆమెకు తన భర్త ద్వారా కూడా ఒక కొడుకు ఉన్నాడు. అయితే ఒక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి విడాకులు ఇచ్చి ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అంటే ఏ కారణంతో చేసుకుంటారని అడిగారట. మీరే అర్థం చేసుకోండి సార్ అని చీఫ్ సెక్రటరీ ఎన్టీఆర్కు చెప్పారట.ఇక దానికి ఎన్టీఆర్ గారు సమాధానం ఇస్తూ అలా కాదు బ్రదర్ నా ఇంట్లో మంచి చెడు చూసే వాళ్ళు ఎవరూ లేరు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అందుకే చేసుకోవాలనుకుంటున్నాను అని తెలియజేశారట.
ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ లక్ష్మీపార్వతి గారు అసలు ఎందుకు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చారు అని అడిగాడు. ఇక దానికి ఆయన సమాధానం చెబుతూ. ఆమె కోరికలు ఆశలు తీర్చుకోడానికి అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక 70 ఏళ్ల ముసలాయనకు విడాకులు ఇచ్చి ఇంకొక 70 ఏళ్ల ముసలాయన ఎందుకు పెళ్లి చేసుకుంటారండి అని అన్నాడు. రాజకీయ కోరికలు కావచ్చు తర్వాత సీఎం అవ్వాలని కోరిక కావచ్చు , డబ్బులు వస్తాయని కావచ్చు, ఇలాంటి కోరికల వలన ఆమె చేసుకుని ఉంటుంది అంటూ ఆయన తెలియజేశారు. అలాగే వారు వీళ్ళు చెబుతుంటే విన్నాను నేను. వారిద్దరికీ ఒక వారసుడు పుడతాడని వాడు దేశాన్ని పరిపాలిస్తాడని ఆశలు కూడా ఉండవచ్చు. కానీ ఆ వయసులో పిల్లలు ఎలా పుడతారని అంటూ ఆయన తెలియజేశారు. అయితే మనం సినిమాల్లో చూస్తున్నట్లుగా ప్రతి హీరోకి ఏదో ఒక వీక్నెస్ ఉంటది. ఎన్టీ రామారావు గారికి అదే వీక్నెస్. నిజం చెప్పాలంటే చాలా దురదృష్టమైన చావు అతనిది. అంత గొప్ప వ్యక్తి ఆ విధంగా చనిపోయి ఉండకూడదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
