Lavanya Tripathi : పెళ్లి కాకుండానే సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ?!
Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ తో హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ శుభకార్యం జరిగిన కొద్ది రోజులకే నిహారిక విడాకులు తీసుకోవడం మీడియాలో సంచలనం సృష్టించింది. దీంతో మెగా ఫ్యామిలీకి పెళ్లిళ్లు కలసి రావడం లేదని.. కామెంట్లు రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉన్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయని వీళ్ళ నిశ్చితార్థం బ్రేక్ అయినట్లు.. ఇటీవల సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఇటలీలో ఈ జంట తాజాగా ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కేఫ్ లో కాఫీ తాగుతూ.. దిగిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది. దీంతో నిశ్చితార్థం బ్రేక్ అయినట్లు వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. అంతే కాదు త్వరలో ఈ జంట పెళ్లి కార్డు తీసుకుని మీడియా ముందుకు కూడా రాబోతున్నట్లు ఆ రకంగా పెళ్లి కాకుండానే.
ఈ జంట వస్తున్న పుకార్లకు సరికొత్త రీతిలో చెక్ పెట్టబోతున్నట్లు సమాచారం. ఆగస్టు నెలలో వీళ్ళ పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇండియాలో కాకుండా ఔట్ డోర్ లో పెళ్లి చేసుకుని… ఇండియాలో రిసెప్షన్ కార్యక్రమం పెట్టే ఆలోచనలో హీరో వరుణ్ తేజ్ ఉన్నట్లు టాక్.