Varun Tej Prabhas : ఊహించని నిర్ణయం తీసుకున్న వరుణ్ తేజ్.. ప్రభాస్ కోసం విలన్ అవతారం ఎత్తుతున్న మెగా హీరో..?
ప్రధానాంశాలు:
Varun Tej Prabhas : ఊహించని నిర్ణయం తీసుకున్న వరుణ్ తేజ్.. ప్రభాస్ కోసం విలన్ అవతారం ఎత్తుతున్న మెగా హీరో..?
Varun Tej Prabhas : ఈ మధ్య యువ హీరోలు విలన్ పాత్రలలో కనిపిస్తూ మెప్పిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో మెగా హీరో డార్లింగ్ Prabhas ప్రభాస్ కోసం విలన్ పాత్ర పోషించనున్నాడనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది. పాన్ ఇండియా స్టార్ అయిన హీరో ప్రభాస్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీ రాజాసాబ్ rajasab Movie చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి విడుదలైన ప్రభాస్ పోస్టర్స్ Prabhas సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
Varun Tej Prabhas మెగా రిస్క్..
ఈ సినిమా తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు ప్రభాస్. ఇందులో కొత్త అమ్మాయి ఇమాన్వీ నటిస్తుంది. ఇవే కాకుండా యానిమల్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ spirit movie చేయనున్నారు. వీరిద్దరి కాంబోపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న ఈ సినిమా సందీప్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటుల ఎంపిక సైతం జరుగుతుందట.సందీప్ రెడ్డి వంగా అయితే స్పిరిట్ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ప్రభాస్ ని యాక్షన్ అవతార్ లో ప్రెజెంట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా కీలకం అని ముందు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. హాలీవుడ్, కొరియన్ నటుడు డాంగ్ లీ ఈ చిత్రంలో విలన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.
ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించడం కోసం మెగా హీరో వరుణ్ తేజ్ Varun Tej ను తీసుకోవాలనే ఆలోచనలు సందీప్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. వరుణ్ విలన్‌గా నటిస్తాడా, లేకుంటే కీలక పాత్రలో నటిస్తారా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. ఇక ఈ సినిమాలో నటించడానికి వరుణ్ సైతం ఆత్రుత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి.