Naga Chaitanya : ఇదేం బాగోలేదు నాగచైతన్య.. అప్పుడు లవర్.. ఇప్పుడు మదర్..
Naga Chaitanya : ప్రస్తుతం కరోనా కారణంగా దాదాపు అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఏపీలో టికెట్ ధరల విషయం కూడా ఇందుకు ఒక కారణమనే చెప్పాలి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మూవీస్‌ను రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్ వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి బడా మూవీలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన ఆచార్య మూవీ రిలీజ్ కానుంది. మరి ఇన్ని సమస్యలు మధ్య ఆ మూవీ సైతం రిలీజ్ అవుతుంతో లేదో చెప్పలేం.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సంక్రాంతి అక్కినేని ఫ్యామిలీకి కలిసి వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతమున్న ఇబ్బందికర పరిస్థితుల్లోనూ బంగార్రాజు మూవీ రిలీజ్ అవడమే కాకుండా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బరిలో ఏ మూవీలో లేకపోవడంతో సంక్రాంతికి బంగార్రాజు హడావుడి మామూలుగా లేదు.బంగార్రాజు మూవీలో నాగార్జున మనవడిగా యాక్ట్ చేశాడు నాగచైతన్య. మాస్ లుక్ అదరగొడుతూ ఫ్యా్న్‌ను ఫుల్ ఖుషీ చేశాడు. సోగ్గాడే చిన్నినాయనా మూవీకి ఇది సీక్వెల్ అనే విషయం అందరికీ తెలిసిందే.

lavanya tripathi who played role of mother and lover to nagachaitanya
Naga Chaitanya : లావణ్య త్రిపాథి రికార్డు..
ఇందులో రాము (నాగార్జున), సీత (లావణ్య త్రిపాథి) కొడుకే నాగచైతన్య. ఇందులో నాగచైతన్యకు లావణ్య త్రిపాథి తల్లి. మరి యుద్ధం శరణం మూవీలో నాగచైతన్యకు లవర్ గా యాక్ట్ చేసింది లావణ్య. అంతకంటే ముందు మనం మూవీలో ఫ్రెండ్‌గా యాక్ట్ చేసింది. ఇలా ఒక హీరోయిన్ ఒక హీరోకు ఫ్రెండ్ గా, లవర్ గా, మదర్‌గా నటించిన రికార్డు కేవలం లావణ్యకు మాత్రమే దక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదిలా ఉండగా సంక్రాంతి బరిలో నిలిచిన బంగార్రాజు ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి.