Laya : ల‌య‌లో త‌గ్గ‌ని గ్రేస్.. వ‌రుస డ్యాన్స్‌ల‌తో కేక పెట్టిస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: June 20, 2022, 8:00 pm

Laya : ఒక‌ప్ప‌టి సీనియ‌ర్ హీరోయిన్ ల‌య ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే సంద‌డి మాములుగా లేదు. తెలుగు అమ్మాయి అయిన లయ చాలా కాలం పాటు తెలుగు సినిమాల్లో నటించింది.తెలుగు అమ్మాయిల్లో చివరిగా ఎక్కువ కాలం హీరోయిన్‌గా నటించింది ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు లయ.ఆమె తర్వాత మరెవ్వరు కూడా ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వలేదు.లయ ప్రస్తుతం నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.కాని ఆమె మాత్రం అత్తగా అమ్మగా నటించేందుకు ఆసక్తి చూపడం లేదు.

కేవలం ముఖ్య పాత్రలు మాత్రమే చేస్తానంటూ భీష్మించుకు కూర్చుంది. సీనియర్ హీరోయిన్ లయ ఒకప్పటి యూత్‌కు క్రష్. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో నటిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యింది లయ. ఇక చాలామంది ఇతర హీరోయిన్లలాగానే లయ కూడా కొంతకాలం తర్వాత పర్సనల్ లైఫ్ మీద దృష్టిపెట్టడం కోసం సినిమాలకు దూరమయ్యింది. కానీ ఈమధ్య కాలంలో లయ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ కూడా షేర్ చేస్తోంది. రీసెంట్‌గా తాను న‌టించిన హ‌నుమాన్ జంక్ష‌న్ లోని పాట‌కు స్టెప్పులేసింది. త‌న పార్ట్‌న‌ర్ సారికారెడ్డితో క‌లిసి గోల్ మాల్ సాంగ్‌కి ఇర‌గదీసే డ్యాన్స్ చేసి నెటిజ‌న్లను అల‌రించింది.

laya dance video viral

laya dance video viral

Laya : ల‌య జోరు..

నేను న‌టించిన హ‌నుమాన్ జంక్ష‌న్‌లోని గోల్‌మాల్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా న‌చ్చుతుంద‌నుకుంటున్నా.. అయితే ట్రై చేయండి.. అంటూ ల‌య పేర్కొంది. చివ‌రిగా అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంలో ఈమె పోషించి పాత్ర ఏమాత్రం ఆకట్టుకోలేదు. లయ త్వరలో త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.  ల‌య సినిమాల‌కు దూర‌మైనా..మూవీ ల‌వ‌ర్స్ కు ఆ లోటు తీర్చేందుకు సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటుంద‌నే విష‌యం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. యూఎస్‌లో ఉంటున్న ఈ బ్యూటీ ఎప్ప‌టిక‌పుడు ట్రెండీ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ప‌లుక‌రిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

Sam C

No bio available for this author.

Tags :
  1. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  2. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  3. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  4. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

  5. "Naresh : పెళ్లి వద్దన్నా పర్లేదు.. పిల్లల్ని కనండి..! వివాదంపై వీకే నరేశ్ క్లారిటీ..!"

  6. "Employees Bonus : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒక్కో ఉద్యోగికి రూ.17,951 బోనస్‌..!"

  7. "Karthika Deepam 2 Today Episode October 15th : జ్యోత్స్న చనిపోయిందా? మృతదేహం దగ్గర అసలు ట్విస్ట్ ఇదే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp