Bigg Boss Priyanka Jain : ప్రియుడితో తిరుమ‌ల వెళ్లిన బిగ్ బాస్ బ్యూటీపై చిరుత దాడి.. వాళ్ల ప‌రిస్థితి ఏంటి?

Authored By aruna | The Telugu News | Published on: March 24, 2024, 4:00 pm

Bigg Boss Priyanka Jain : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కార్య‌క్ర‌మంలో కంటెస్టెంట్‌గా పాల్గొని త‌న ఆట‌తో అంద‌రికి ద‌గ్గ‌రైంది ప్రియాంక జైన్.ఈమె బిగ్ బాస్ షోకి రాక‌ముందు సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది . అయితే బిగ్ బాస్ షోలో అమర్ దీప్, శోభాశెట్టిలతో కలిసి గ్రూప్ గేమ్ ఆడిన ఈ భామ టాప్ 5లో నిలిచింది.ఇక హౌజ్‌లో ఉన్న‌ప్పుడు త‌న ప్రియుడితో డేటింగ్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ఫ్యామిలీ వీక్ స‌మ‌యంలో ప్రియుడు ఇంట్లోకి రాగా వారిద్ద‌రు ప్ర‌పంచాన్ని మ‌రిచిపోయి రెచ్చిపోయారు. అప్ప‌టి వ‌ర‌కు వీరి ప్రేమాయ‌ణం గురించి ఎవ‌రికి తెలిసేది కాదు. కాని త‌ర్వాత మాత్రం వీరిద్ద‌రు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు.

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ప్రియాంక జైన్.. తన ప్రియుడితో క‌లిసి చేస్తున్న ర‌చ్చ మాములు కాదు.కెరీర్ ప‌రంగా సెటిల్ అయ్యేందుకు ఈమె చేస్తున్న ప్ర‌య‌త్నాలు మాములుగా లేవు. ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో అనేక వీడియోలు చేస్తూ తెగ సందడి చేస్తుంది. రీసెంట్‌గా ప్రియాంక తిరుమలకు వెళ్లింది. అయితే ప్రియుడితో పాటు మరో ఇద్దరు స్నేహితులను కూడా వెంట తీసుకొని న‌డ‌క దారిన తిరుమ‌ల‌కి వెళ్లారు. అయితే అక్క‌డి విశేషాల‌ని ప్రియాంక వీడియోగా మలిచి తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టింది.

అయితే వారు మెట్లు ఎక్కుతున్న స‌మ‌యంలో చిరుతపులి క‌న‌ప‌డ‌డంతో చాలా భ‌య‌ప‌డిపోయి భ‌యంతో ప‌రుగులు పెట్టారు. త‌న స్నేహితులు సైతం చిరుత‌పులి అనుకొని ప‌రుగులు తీసారు. ఒకరినొకరు గట్టిగా పట్టేసుకుంటూ చీత బారి నుంచి తప్పించుకోలేమో అంటూ చాలా వణికిపోయారు. ముఖ్యంగా ప్రియాంక జైన్, శివ్ లతో పాటు వచ్చిన మరో జంట అయితే ప్రాణాలు పోయినట్లుగానే క‌నిపించారు. అయితే చివ‌రికి చావు క‌బురు చ‌ల్లగా చెప్పిన‌ట్టు అదంతా ఫ్రాంక్ అని చెప్పారు. స్నేహితుల‌ని భ‌య‌పెట్టేందుకు అలా చేశామ‌ని అన్నారు. ఆ మ‌ధ్య హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ట్టు కూడా ఓ ప్రాంక్ వీడియో చేసి నెట‌జ‌న్స్‌తో తిట్లు తిన్నారు.

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp