Vijay Devarakonda : లైగర్ స్టోరీ ఇదే.. మైక్ టైసన్ తో ఈ మూవీలో విజయ్ దేవరకొండ అందుకే పోరాడతాడట..
Vijay Devarakonda : లైగర్.. సాలా క్రాస్ బ్రీడ్.. ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. నిన్న(గురువారం) ట్రైలర్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. పూరి.. రౌడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. పూరీ జగన్నాథ్, టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రముఖ బాక్సార్ మైక్ టైసన్ నటిస్తుండటం ఆకట్టుకునే అంశం. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ కలిసి ఈ మూవీని తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ కి జోడీగా నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్నఈ సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇక తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌ని గురువారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సల్మాన్ దుల్కర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. విజయ్ యాటిట్యూడ్.. పూరీ డైరెక్షన్ మార్క్ తో మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. విజయ్ డైలాగ్స్ కి రౌడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయి ప్రస్తుతం లైగర్ మూవీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మూవీలో మైక్ టైసన్ కి విజయ్ కి ఉన్న సంబంధం ఏంటీ..మైక్ టైసన్ పై అభిమానంతో అతనితో ఒక సెల్ఫి దిగాలన్నది లైగర్ కల అంట. ఏకంగా టైసన్ తోనే తలపడి ఓడించి స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్న టైసన్ ని తన ఒళ్లో పొడుకోపెట్టుకొని సెల్ఫీ దిగుతాడని ఓ స్టోరీ వైరల్ అవుతోంది.
Vijay Devarakonda : దిగాలని…
ఇక పూరీ మూవీల్లో దాదాపు తల్లి సెంటిమెంట్ ఉంటుందన్నది నిజం. మూవీలో కూడా మదర్ సెంటిమెంట్ అద్బుతంగా తీర్చిదిద్దాడట. విజయ్ తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కూడా పూరీ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీలో కూడా బాక్సింగ్.. మదర్ సెంటిమెంట్ తో సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లాడు. మళ్లీ ఇన్నాళ్లకి ఇదే నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాలకు అభిమానులు పోలిక పెట్టి చూస్తున్నారు. కాగా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో..