Lokulu Kakulu Aunty : సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి లోకులు కాకులు ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె మైక్ కనిపిస్తే చాలు నాకు చంద్రబాబు నాయుడు తెలుసు.. నాకు జగన్మోహన్ రెడ్డి తెలుసు.. నాకు చిరంజీవి తెలుసు.. అంటూ రక రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదా అన్నట్లుగా ఆమె ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాంటి లోకులు కాకులు ఆంటీని రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను లు ఇటీవల జబర్దస్త్ స్టేజి ఎక్కించిన విషయం తెలిసిందే. గెటప్ శ్రీను లోకలు కాకులు ఆంటీ గెటప్ వేసి ఏకంగా ఆమె ముందే నటించాడు. ఆ స్కిట్ మంచి సక్సెస్ అయింది. అంత బాగానే ఉంది ఈ సమయంలోనే బుల్లి తెర వర్గాల్లో జరుగుతున్న చర్చ వైరల్ గా మారింది.
అదేంటి అంటే మల్లెమాల వారు లోకులు కాకులు ఆంటీకి ఇచ్చిన పేమెంట్ చాలా తక్కువ అట.. గతంలో ఒకటి రెండు కార్యక్రమాలకు వెళ్ళిన సమయంలో ఆమెకి వచ్చిన పారితోషికంలో కనీసం పావు వంతు కూడా ఇవ్వలేద.ట అడిగితే అంతకు మించి ఇవ్వడం కుదరదు అనేసి చెప్పేశారట. రాంప్రసాద్ మంచి పారితోషికం ఇస్తాం అంటూ ఆమెను తీసుకు వచ్చి చివరకు ఆమెకు మినిమం పారితోషికం కూడా ఇవ్వకుండా పంపించాడు అంటూ మల్లెమాల వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగానే ఈటీవీ మల్లెమాల వారు రెమ్యూనరేషన్ విషయంలో చాలా పిసినారితనం చూపిస్తారని అందరూ అంటూ ఉంటారు.
తాజాగా లోకులు కాకులు ఆంటీ విషయంలో కూడా అదే నిరూపితమైంది. ఆమెకు మరీ 1500 లేదా 2000 రూపాయలు ఇచ్చి పంపించారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. ఆమెకు గౌరవప్రదంగా 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చే పంపించారు అంటూ కొందరు చెబుతున్నారు. అసలు ఆమెకి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంలో క్లారిటీ లేదు, రాంప్రసాద్ ఆమెకు కొంత మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన టీంలో చేసింది కాబట్టి.. కానీ రాంప్రసాద్ ఇవ్వకుండా మల్లెమాల వారు ఇస్తారని వదిలేయడంతో ఆమెకు అన్యాయం జరిగిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. మరో సారి ఆమె జబర్దస్త్ స్టేజి ఎక్కేందుకు ఆసక్తి చూపించడం లేదని.. ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఆమెకు రెండు మూడు వేలు ఇస్తారని, జబర్దస్త్ వాళ్ళు మాత్రం నీచంగా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారంటూ ఆమె అసహ్యంగా బూతులు తిడుతూ శాపనార్ధాలు పెడుతుందట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.