Nidhhi Agerwal : పీకల్లోతు ప్రేమలో ఉన్న నిధి అగర్వాల్ అతడి గురించి తెలిసి బ్రేక్ చెప్పిందా?
ప్రధానాంశాలు:
Nidhhi Agerwal : పీకల్లోతు ప్రేమలో ఉన్న నిధి అగర్వాల్ అతడి గురించి తెలిసి బ్రేక్ చెప్పిందా?
Nidhhi Agerwal : ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు తనదైన అందచందాలతో కుర్రకారుని హీటెక్కిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించిన నిధి అగర్వాల్.. తొలుత మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. 2017లో ‘మున్నా మైఖేల్’ అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ గడప తొక్కిన ఈ అందాల భామ నాగ చైతన్యతో అద్భుతమైన రొమాన్స్ సాగించింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అప్పటి నుండి వరుస సినిమాలు చేస్తూ కుర్రాళ్లకి తెగ కిక్కెస్తుంది.
Nidhhi Agerwal : నిధి ప్రేమయాణం బ్రేకప్..
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన అందాలతో హంగామా చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది నిధి అగర్వాల్. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. అయితే ఈ భామ ఇప్పుడు బ్రేకప్ బాధలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ మూవీ హరి హర వీరమల్లు చేస్తుండగా, ఈ మూవీ ఎలక్షన్స్ వలన ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ మూవీ హిట్ అయితే మాత్రం నిధికి తిరుగు ఉండదు అని చెప్పాలి. మరోవైపు ప్రభాస్ రాజా సాబ్ చిత్రంలో కూడా నిధి నటిస్తుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా, అందులో నిధి మెయిన్ లీడ్‌గా నటిస్తుంది. అయితే నిధికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

Nidhhi Agerwal : పీకల్లోతు ప్రేమలో ఉన్న నిధి అగర్వాల్ అతడి గురించి తెలిసి బ్రేక్ చెప్పిందా?
నిధి అగర్వాల్ ప్రేమలో ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నటుడికి సంబంధించిన కొన్ని చేదు నిజాలు తెలియడంతో అతనితో తెగ తెంపులు చేసుకొని తీవ్రమైన డిప్రెషన్‌లో ఉందట. ఇక జీవితంలో మళ్లీ ప్రేమ జోలికి కూడా పోకూడదని భావించిందట. పూర్తి దృష్టి కెరీర్‌పై పెట్టి టాప్ హీరోయిన్‌గా ఎదగాలని అనుకుంటుందట. ప్రస్తుతం నిధికి సంబంధించిన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుండగా, దీనిపై క్లారిటీ రావలసి ఉంది.