Nidhi Agarwal : ఇస్మార్ట్ బ్యూటీ ఎంత పని చేసింది.. హరి హర వీరమల్లు స్టోరీ మొత్తం లీక్ చేసిందిగా..!
ప్రధానాంశాలు:
Nidhi Agarwal : ఇస్మార్ట్ బ్యూటీ ఎంత పని చేసింది.. హరి హర వీరమల్లు స్టోరీ మొత్తం లీక్ చేసిందిగా..!
Nidhi Agarwal : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan అభిమానులు ఎంతగానో ఆసక్తి చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇందులో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా మూవీ పోస్టర్ విడుదల చేయగా, ఈ పోస్టర్‌లో ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నారు ఈ జంట. ఈ ఇద్దరు కూడా మంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. కొల్లగొట్టినాదిరో అంటూ సాగే రెండో పాటను ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

Nidhi Agarwal : ఇస్మార్ట్ బ్యూటీ ఎంత పని చేసింది.. హరి హర వీరమల్లు స్టోరీ మొత్తం లీక్ చేసిందిగా..!
Nidhi Agarwal ఆ విషయాలు వెల్లడి..
చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు చిత్రంలో నటించడాన్ని తను అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. హరిహర వీరమల్లు సినిమాలో తన పాత్ర ఇప్పటి వరకు తను చేసిన అన్ని సినిమాల్లో కంటే చాలా ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడింది. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడం పట్ల గర్వంగా ఉందని తెలిపింది
అయితే సినిమా గురించి మాకు తెలియని విషయాలు వెల్లడిస్తారా అని నిధి అగర్వాల్‌ని ప్రశ్నించగా, ఈ సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు హై సన్నివేశాలతో నిండిపోయి ఉంటుందని అన్నారు. ఇందులో ఉండే ట్విస్ట్‌లతో అభిమానులు ఆశ్చర్యపోతారని నిధి పేర్కింది.