Nidhhi Agerwal : ఆ హీరోతో డేటింగ్ చేయ‌వ‌ద్ద‌ని నిర్మాత‌ల కండీష‌న్.. నిధి అగ‌ర్వాల్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nidhhi Agerwal : ఆ హీరోతో డేటింగ్ చేయ‌వ‌ద్ద‌ని నిర్మాత‌ల కండీష‌న్.. నిధి అగ‌ర్వాల్ కామెంట్స్

 Authored By ramu | The Telugu News | Updated on :23 March 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Nidhhi Agerwal : ఆ హీరోతో డేటింగ్ చేయ‌వ‌ద్ద‌ని నిర్మాత‌ల కండీష‌న్.. నిధి అగ‌ర్వాల్ కామెంట్స్

Nidhhi Agerwal : ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్. ఈ భామ ప్ర‌స్తుతం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ ‘ది రాజాసాబ్‌’ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా నిధి ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాను నటించిన చిత్ర విశేషాలతో పాటు కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన కీలక విషయాలు షేర్ చేసుకున్నారు.

Nidhhi Agerwal ఆ హీరోతో డేటింగ్ చేయ‌వ‌ద్ద‌ని నిర్మాత‌ల కండీష‌న్ నిధి అగ‌ర్వాల్ కామెంట్స్

Nidhhi Agerwal : ఆ హీరోతో డేటింగ్ చేయ‌వ‌ద్ద‌ని నిర్మాత‌ల కండీష‌న్.. నిధి అగ‌ర్వాల్ కామెంట్స్

Nidhhi Agerwal ప‌ట్టించుకోను..

టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ‘మున్నా మైకేల్‌’ అనే బాలీవుడ్ మూవీతో త‌న కెరీర్ ప్రారంభం అయింద‌ని చెప్పిన నిధికి టీమ్ కండీష‌న్ పెట్టింద‌ట‌. . సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన విధి విధానాలు ఆ కాంట్రాక్ట్‌లో పొందుపరిచారు. అందులోనే నో డేటింగ్‌ అనే షరతు విధించారు. సినిమా పూర్తయ్యేవరకూ హీరోతో నేను డేట్‌ చేయకూడదని దాని అర్థం. కాంట్రాక్ట్‌ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా ఇవన్నీ చదవలేదు. ఆ తర్వాతే నాక్కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను.

నటీనటులు ప్రేమలో పడితే వర్క్‌పై దృష్టిపెట్టరని ఆ టీమ్‌ భావించి ఉండొచ్చనుకుంటున్నాను. అందుకే ఇలాంటి షరతులు పెట్టి ఉంటుందనుకున్నాను అని నిధి అగర్వాల్ ఓ పాడ్​కాస్ట్​లో చెప్పుకొచ్చారు. అలాగే ఆన్​లైన్ ట్రోలింగ్ గురించి కూడా నిధి అగర్వాల్ మాట్లాడారు. ఈ ప్రపంచంలో మంచి, చెడు రెండూ ఉన్నాయని చెప్పారు. కేవలం మంచి మాత్రమే ఉందనడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటివాటిని పెద్దగా పట్టించుకోను. సోషల్‌ మీడియా కామెంట్స్‌ నాపై పెద్దగా ప్రభావం చూపించలేవు అని నిధి అగర్వాల్ వ్యాఖ్యానించారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది