Bigg Boss OTT Telugu : యాంకర్ శివ మామూలోడు కాదు.. ఓవైపు బిందు.. మరోవైపు హమీదా.. ఎవ్వరినీ వదలడం లేదుగా
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే లవ్ ట్రాక్ లు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే అరియానా, అజయ్ జంట హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు యాంకర్ శివ.. హౌస్ లో ఉన్న అందగత్తెలను పడేసే పనిలో పడ్డాడు. హౌస్ లోనే ఎక్కువగా ఫ్లర్టింగ్ చేస్తే కంటెస్టెంట్ గా యాంకర్ శివ రికార్డు సృష్టిస్తున్నాడు.ముందు బిందును ఫ్లర్ట్ చేసిన యాంకర్ శివ.. తర్వాత హమీదాను కూడా వదలడం లేదు. యాంకర్ శివ దృష్టి మొత్తం ఇద్దరి మీదే ఉంది. బిందు మేకప్ వేస్తుంటే కూడా యాంకర్ శివ చూసి తట్టుకోలేకపోతున్నాడు. బిందు నువ్వు మేకప్ వేస్తే చూడలేకపోతున్నాను.. అంటూ తనను తెగ ఫ్లర్ట్ చేస్తున్నాడు.

love track of shiva with hamida and bindhu in bigg boss ott telugu
Bigg Boss OTT Telugu : యాంకర్ శివ.. బిందును ఫ్లర్ట్ చేస్తున్నాడని శివపై ఇతర కంటెస్టెంట్ల కామెంట్స్
యాంకర్ శివ.. కేవలం అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడంపైనే దృష్టి పెడుతుండటంతో మిగితా చాలెంజర్స్ అతడిని ఆటపట్టిస్తున్నారు. బిందు మేకప్ వేసుకుంటే నీకొచ్చిన సమస్య ఏంటి.. అంటూ అతడిని ఆటపటిస్తున్నారు.హమీదా వచ్చి యాంకర్ శివ దగ్గర మాట్లాడితే.. నువ్వు మాట్లాడినప్పుడు బిందు రావద్దు.. బిందూ మాట్లాడినప్పుడు నువ్వు నా దగ్గరికి రాకు.. అని శివ ఎంతో క్లారిటీగా హమీదాకు చెప్పాడు. శివ.. తమ ఇద్దరికీ ట్రై చేస్తున్నాడని తెలిసి కూడా ఇద్దరూ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు తప్పితే.. వాళ్లు కూడా పెద్దగా మాకు ఆసక్తి లేదు అని మాత్రం చెప్పడం లేదు.
ఇక.. యాంకర్ శివ విషయాన్ని వదిలేస్తే.. ఇక ఇంట్లో ఉన్న లేడీ కంటెస్టెంట్లు ఎక్కువగా అజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అరియానాతో పాటు ముమైత్ ఖాన్ కూడా అజయ్ పై ఇంట్రెస్ చూపిస్తున్నారు.ప్రస్తుతానికైతే.. బిగ్ బాస్ హౌస్ లో ఇవే లవ్ ట్రాక్స్ ఇవే. చూద్దాం.. ఇంకా మున్ముందు ఇంకెన్ని లవ్ జంటలు బిగ్ బాస్ హౌస్ లో పుట్టుకొస్తాయో.