Bigg Boss 5 Telugu: ప్రపంచంలోనే అతిపెద్ద బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే మొదలైన సంగతి తెలిసందే. గత సీజన్స్ కంటే పూర్తి భిన్నంగా 5 రెట్ల ఎంటర్‌టైన్మెంట్ తో గ్రాండ్ గా మొదలైంది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, ఈసారి హౌజ్‌లోకి 19మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అయితే ప్రతీ సీజన్‌లో ఏదో ఒక జంట మధ్య లవ్ మొదలై వారి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. ఇది షోలో భాగమే అనుకున్నా కూడా బయటకి వచ్చాక కూడా కొంతమంది కంటిన్యూ అవుతూ వస్తున్నారు.
love track started in bigg-boss-5-telugu
కానీ అది పూర్తిగా నిజం అని నమ్మడానికి లేకుండా పోతోంది. ఏదైమైనా హౌజ్‌లో నడిచే ప్రేమాయణాలు జనాలను బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. రెండో సీజన్‌లో సామ్రాట్, తేజస్వి..మూడో సీజన్ పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్..నాలుగో సీజన్‌లో అఖిల్, మోనాల్ గజ్జర్ ల మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ఈ జంటకి బయట కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పక తప్పదు. ఇక హౌజ్‌లో పార్టిసిపెంట్స్ మధ్య వచ్చే తగాదాలు, చిరాకులు, పరాకులు కూడా షో మీద ఆసక్తికి కలిగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఇప్పుడు కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 5లోనూ లవ్ ట్రాక్ మొదలైంది. ఈ సారి ఇంట్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో చాలా మందికి పెళ్లిళ్లు అయిపోయాయి.
షణ్ముఖ్, మోడల్ జస్వంత్, మానస్ లాంటి వారు మాత్రమే పెళ్లి కాని వారు. అమ్మాయిలలో కూడా చాలా మంది ఉన్నారు. వీరిలో ప్రస్తుతానికి మాత్రం ఒకరు తన ఇష్టాన్ని బయటపెట్టారు. ఆమె ప్రియాంక సింగ్. జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రియాంక, ముందు అబ్బాయి. ఆ తర్వాత అమ్మాయిగా మారిపోయింది. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తర్వాత తన కష్టాలను అందరితోనూ చెప్పుకుంటోంది. హౌజ్‌లో వారిని అన్నయ్యా అని పిలుస్తూ పలకరిస్తుంది. యాంకర్ రవి, విశ్వ, శ్రీరామచంద్ర సహా మిగిలిన వారినీ అన్నయ్యా అనే పిలుస్తున్న ప్రియాంక..మానస్ ని మాత్రం అన్నయ్యా అని పిలవడం లేదు. అంతేకాదు ఇన్‌డైరెక్ట్‌గా తనమీద క్రష్ ఉన్నట్టుగా చెబుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎవరికి ఎవరి మీద ప్రేమ పుడుతుందో.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.