Bigg Boss 5 Telugu : ఇద్దరితో ముడిపెడుతున్నారుగా.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ట్రాక్ వర్కవుట్ అయ్యేనా?

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 9, 2021, 7:59 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు  Bigg Boss 5 Telugu టీం ఎప్నుడూ కూడా ట్రాకుల మీదే ఆధారపడుతుంది. షో మొదలై మూడు రోజులు అవుతున్నా కూడా ఇంకా సరైన ట్రాక్ క్రియేట్ అవ్వలేదు. గొడవలతో సరిపోతోంది. ఇక మగవారు మాత్రం అంతా కూల్, చిల్ అనే ధోరణిలోనే ఉన్నారు. రెండు కొప్పులు ఒకేచోట ఉండలేవు అనే సామెతను నిజం చేస్తూ అమ్మాయిలు రోజూ గొడవలు పడుతూనే ఉన్నారు.

Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu

Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu

అయితే ఆర్జే కాజల్ మాత్రం ఏదో ఒక ట్రాక్ క్రియేట్ చేసే వరకు నిద్రపోయేలా లేదు. ప్రియాంక సింగ్.. అందరినీ అన్న అంటూ పిలుస్తోంది. కానీ మానస్‌ను మాత్రం అలా పిలవడం లేదు. ఇక శ్రీరామ చంద్రను కూడా నార్మల్‌గానే పిలుస్తోంది. ఈ ముగ్గురి మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ టీం యోచిస్తోందేమో. కానీ నిన్నటితో మాత్రం ఒకటి క్లియర్ అయింది.

Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu

Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu : ఇద్దరితో ముడిపెడుతున్నారుగా.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ట్రాక్ వర్కవుట్ అయ్యేనా?

ప్రియాంక వంట గదిలో ఉంటే.. శ్రీరామచంద్ర, మానస్ ఆ చుట్టు పక్కలే ఉంటున్నారని తెలిసింది. ప్రియాంక చాలా మంచిది.. వంట బాగా చేస్తుంది.. తనంటే గౌరవం ఉంది అని మానస్ చెప్పుకొచ్చాడు. అంతకు మించి ఏం లేదని చెప్పేశాడు. అలా మొత్తానికి ఈ ట్రాన్స్ జెండర్ ట్రాక్ వర్కవుట్ చేద్దామని బీబీ టీం కూడా బాగానే ప్రయాసలు పడుతున్నట్టు కనిపిస్తోంది.

Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu

Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp