Priyanka Singh : షోలో అనుకోకుండా ప్రమాదం.. ఒక్కసారిగా కూలిపడ్డ ప్రియాంక సింగ్

Authored By aruna | The Telugu News | Published on: July 23, 2022, 6:30 pm

Priyanka Singh : బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక సింగ్. తన చేష్టలతో అందరినీ కొన్నిసార్లు విసిగించేసింది ప్రియాంక. మానస్ చుట్టూరా చేరి అతడిని టార్చర్ పెట్టేసినట్టు అనిపించింది. కొన్ని సార్లు యాంకర్ రవి చెప్పినందు వల్లే మానస్ చుట్టూ తిరిగినట్టు అనిపించింది. ఫ్రెండ్‌గా మానస్ చూస్తుంటే.. ప్రియాంక మాత్రం ఇంకా ఏదో ఆశించినట్టు అనిపించింది. మొత్తానికి మానస్ ప్రియాంక ట్రాక్ మాత్రం జనాలను ఎంటర్టైన్ చేసింది.. మధ్యలో చికాకు పెట్టించింది. అలా మొత్తానికి ప్రియాంక మాత్రం మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

బయటకు వచ్చాక కూడా మానస్, సన్నీ, జెస్సీ, శ్రీరామచంద్ర, రవి, ప్రియా వంటి వారితో కలిసి బాగానే సందడి చేస్తోంది. అయితే ఇప్పుడు స్టార్ మా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఈవెంట్ చేసింది. ఇందులో భాగంగా ఐదో సీజన్ కంటెస్టెంట్లు ఎక్కువగా వచ్చారు. ఇందులో సన్నీ, ప్రియాంక సింగ్, సిరి వంటి వారు పర్ఫామెన్స్‌లతో రెచ్చిపోయారు. ఇక టాస్కులు ఆడే సమయంలో ప్రియాంకకు ఒక్కసారిగా ప్రమాదం ఏర్పడింది. సడెన్‌గా కింద పడిపోయింది. దీంతో ఆమెకు ఏమై ఉంటుందా? అని అందరూ కంగారు పడ్డారు.

Priyanka Singh Fall In Bigg Boss Kings Vs Queen Event

Priyanka Singh Fall In Bigg Boss Kings Vs Queen Event

ఆమె మొహానికి గాయమైనట్టు అనిపించింది. అయితే ఇంతలో సన్నీ వచ్చి ఓ కౌంటర్ వేశాడు. నీ నడుముకు ఏమీ కాలేదు కదా? అని కౌంటర్ వేయడంతో.. అందరూ నవ్వేశారు. ప్రియాంక సైతం ఒక్కసారిగా ఫక్కున నవ్వేసింది. మొత్తానికి ఈ ఈవెంట్‌లో ప్రియాంక రెచ్చిపోయింది. అవినాష్‌తో కలిసి రొమాన్స్‌లో దుమ్ములేపేసింది. అవినాష్ రెచ్చగొట్టడంతో ప్రియాంక రెచ్చిపోయింది. నువ్ నిజంగా క్వీన్ అయితే.. నీకు దమ్ముంటే.. నన్ను హగ్ చేసుకో అని అవినాష్ సవాల్ విసురుతాడు.

అవినాష్‌ చాలెంజ్‌కు ప్రియాంక రెచ్చిపోతుంది. అవినాష్‌ను తన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.అలా మొత్తానికి అవినాష్, ప్రియాంకలు స్టేజ్ మీదే రెచ్చిపోయారు. ఈ ప్రోమోలో టీఆర్పీ స్టంట్ల కోసం మంచి డ్రామా ఆడినట్టు కనిపిస్తోంది. చివర్లో గొడవ కూడా పడ్డారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp