Vishnu Priya : ఊపు ఊపేసిందిగా.. మానస్‌తో విష్ణుప్రియ చిందులు.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : ఊపు ఊపేసిందిగా.. మానస్‌తో విష్ణుప్రియ చిందులు.. వీడియో వైరల్

 Authored By aruna | The Telugu News | Updated on :2 September 2022,12:00 pm

Vishnu Priya : విష్ణుప్రియ వేసే స్టెప్పులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆమె బుల్లితెరపై స్టెప్పులు వేసినా, సోషల్ మీడియాలో చిందులు వేసినా వైరల్ అవుతుంటాయి. ఇక అద్దం ముందు నిలబడి, టీ షర్ట్ పైకి లేపి.. స్టెప్పులు వేస్తూ ఉంటే అందరూ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ఆమె ఓ ప్రైవేట్ ఫోక్ సాంగ్‌లో నటించింది. ఇందులో మానస్, విష్ణుప్రియలు కలిసి చిందులు వేశారు. జ్యోతి, ప్రియ, ప్రశాంత్ నిర్మాతలుగా మదిన్ సంగీత సారథ్యంలో వి.జె .శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో మానస్ నాగులపల్లి, యాంకర్ విష్ణు ప్రియ నర్తించిన ‘జరీ జరీ పంచె కట్టు’ ఫోక్ సాంగ్ ను నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసారు.

ఈ పాటను పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు రఘు కుంచె, సుద్దాల అశోక్ తేజ, వి జె శేఖర్ మాస్టర్, సాకేత్, రమణా చారి, ప్రసన్నకుమార్, పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బిగ్ బాస్ ఫేమ్స్ కాజల్, సన్నీ తదితరులు హాజరయ్యారు. ఇక ఈ పాట గురించి మానస్ మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ్ గారితో లిరిక్స్ రాయించుకొని, శేఖర్ మాస్టర్ కు మాకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోయినా శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ లోనే ఈ పాట చెయ్యాలని పట్టు బట్టి చేసిన నివ్రితి వైబ్స్ వారికి థాంక్స్ చెప్పాలన్నాడు.

Maanas And Vishnu Priya Jari Jari Panche Kattu Song Released

Maanas And Vishnu Priya Jari Jari Panche Kattu Song Released

ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ పాటను నిర్మించడం మామూలు విషయం కాదని అన్నాడు. మొత్తానికి ఈ పాట మాత్రం ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఊపు ఊపేసిందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. విష్ణు ప్రియ అందాలు కూడా ఈ పాటకు ప్లస్ అయ్యాయి. ఇక మానస్, విష్ణుప్రియ కెమిస్ట్రీ కూడా బాగానే కలిసి వచ్చింది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది